అనుష్క ఘాటి.. ఫైనల్ గా వచ్చే డేట్ చెప్పేసారు
ఓ స్పెషల్ పోస్టర్ తో పాటు వీడియోను షేర్ చేశారు. పోస్టర్ లో నెత్తుటి మరకలతో అనుష్క కనిపిస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. చేతిలో తుపాకీతో కొండపై భీకరమైన లుక్ లో ఉన్నారు.
స్టార్ హీరోయిన్ అనుష్క.. చిన్న గ్యాప్ తర్వాత ఘాటి మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ రోల్ లో ఆమె నటిస్తున్న ఘాటి.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోంది. సర్వైకల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఘాటి మూవీపై ఆడియన్స్ లో వేరే అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ తో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అనుష్క రోల్ మాస్ షేడ్స్ తో ఉండబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా అందరికీ క్లారిటీ వచ్చేసింది. సరికొత్త స్టోరీతో మూవీ ఉండబోతున్నట్లు అర్థమైపోయింది.
దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 18వ తేదీన ఘాటిని రిలీజ్ చేయబోతున్నట్లు ఆదివారం తెలిపారు.
ఓ స్పెషల్ పోస్టర్ తో పాటు వీడియోను షేర్ చేశారు. పోస్టర్ లో నెత్తుటి మరకలతో అనుష్క కనిపిస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. చేతిలో తుపాకీతో కొండపై భీకరమైన లుక్ లో ఉన్నారు. వీడియోలో డైరెక్టర్ క్రిష్ తోపాటు టీమ్ అంతా మూవీ వర్క్ ఎంతవరకు వచ్చిందోనని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు.
ఇంతలో అనుష్క వచ్చి.. క్యూట్ క్యూట్ గా రిలీజ్ డేట్ ను రివీల్ చేస్తారు. అయితే సరైన విడుదల తేదీని ఘాటి మేకర్స్ సెలెక్ట్ చేసుకున్నారనే చెప్పాలి. అప్పుడే అందరికీ హాలీడేస్ స్టార్ట్ అవుతాయి. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే సినిమాకు తిరుగుండదు. మేకర్స్ కూడా అంతే రీతిలో ప్రమోట్ చేయాలి.
ఇక సినిమా విషయానికొస్తే.. మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రాఫర్ గా, నాగవెల్లి విద్యా సాగర్ మ్యూజిక్ డైరెక్టర్ గా, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి ఎడిటర్లుగా పనిచేస్తుండగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. మరి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఘాటి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.