ఆర్జీవీ వంతు వచ్చేసిందా?

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళీ అరెస్టు తర్వాత సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రామగోపాల్ వర్మపై పోలీసులు ఫోకస్ చేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.;

Update: 2025-03-05 05:28 GMT

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళీ అరెస్టు తర్వాత సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రామగోపాల్ వర్మపై పోలీసులు ఫోకస్ చేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీసిన వర్మ రాష్ట్రం విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఒంగోలు, మంగళగిరి, అనకాపల్లిలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణకు రమ్మంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో వర్మ హైకోర్టును ఆశ్రయించారు.

హర్రర్, యాక్షన్ సినిమాల డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ నిజజీవితంలో టెర్రర్ అంటే ఎలా ఉంటుందో ప్రభుత్వం చూపుతోందని అంటున్నారు. తన సినీ కెరీర్ లో పోలీసులను హీరో, విలన్ క్యారెక్టర్లలో చూపిన వర్మ ఇప్పుడు పోలీసు పవర్ కు హడలిపోతున్నారని చెబుతున్నారు. దీనికి తనపై నమోదైన కేసుల్లో విచారణను అడ్డుకోవాలని ఆయన హైకోర్టును ఆశ్రయించడమే ఉదాహరణ అంటూ టీడీపీ విమర్శిస్తోంది. ముఖ్యంగా సినీ నటుడు పోసాని అరెస్టు తర్వాత వర్మలో భయం మరింత ఎక్కువైందని టాక్ వినిపిస్తోంది.

పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పీటీ వారెంటుపై ఆయనను రాష్ట్ర నలుమూలలా పోలీసులు చెబుతున్నారు. దీంతో వర్మకు టెన్షన్ పెరిగిపోతుందని టీడీపీ చెబుతోంది. అందుకే పోలీసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పోసానికి వైసీపీతో నేరుగా సంబంధాలు ఉండగా, వర్మ పరోక్ష సంబంధాలు నెరిపారని చెబుతున్నారు.

వైసీపీ సానుభూతిపరుడిగా వ్యవహరించిన వర్మ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లను కించపరిచేలా గతంలో పోస్టులు చేయడం, సినిమాలు తీశారనే ఆరోపణలతో చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఒంగోలు పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరైన వర్మ.. గుంటూరు సీఐడీ పోలీసుల ఎదుట హాజరు కాకుండా గడువు కోరారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లి తనపై రాష్ట్రంలో నమోదైన కేసులను సవాల్ చేశారు. దీంతో పోసాని ఎపిసోడ్ వర్మలో గుబులు పుట్టిస్తోందని ప్రచారం ఎక్కువవుతోంది.

Tags:    

Similar News