ఫస్ట్ టైమ్ బికినీ వేసి.. RGV కోరికను తీర్చేసిన అరియానా!
ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో నెటిజన్స్ ని అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ మొట్టమొదటిసారి బికినీలో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.
బిగ్ బాస్ షోతో బుల్లితెర ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న అరియానా గ్లోరికి సోషల్ మీడియాలో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య ఈ బిగ్ బాస్ బ్యూటీ సోషల్ మీడియాలో తన అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది అరియానా. ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ సీజన్ 4 లో ఛాన్స్ కొట్టేసింది.
హౌస్ లో తన తన అందం, ఆట తీరుతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ముఖ్యంగా ముక్కు సూటిగా మాట్లాడే తత్వం, ఎవరు తప్పు చేసినా వెంటనే ప్రశ్నించడంతో ఆ సీజన్ ఫైనల్ వరకు వెళ్లి నాలుగవ స్థానంలో నిలిచింది. అలా బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న అరియానా ఆ తర్వాత పలు టీవీ షోలలో కనిపించి సందడి చేసింది.
ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో నెటిజన్స్ ని అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ మొట్టమొదటిసారి బికినీలో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అరియానా లేటెస్ట్ బికినీ ఫొటోస్ నెట్టింట రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక అరియానా బికినీ పిక్స్ చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా రీసెంట్ గా అరియానా నెగిటివ్ కామెంట్స్ పై కూడా రియాక్ట్ అయింది. ఈ మధ్య ఆమె బాగా బరువు పెరగడంతో దీనిపై నెటిజన్స్ పలు విమర్శలు చేశారు. దాంతో రియాక్ట్ అయిన అరియానా..' సన్నగా ఉన్నా విమర్శిస్తారు, లావైనా విమర్శిస్తారు. అయినా నా శరీరం నా ఇష్టం. మధ్యలో మీ గోల ఏంటి' అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మరోవైపు అరియానాను వెలుగులోకి తెచ్చిన రాంగోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో ఆమెను చూసి 'నువ్వు హాట్ గా ఉన్నావ్. నిన్ను బికినీలో చూడాలని ఉందని' కామెంట్ చేశాడు.
ఎట్టకేలకు ఫస్ట్ టైం బికినీ వేసి వర్మ కోరికను తీర్చేసింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. మరి ఇంతకీ వర్మ అరియానా బికినీ ఫోటోలను చూశాడా? చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో? అంటూ నెటిజన్స్ అంతా వర్మ రియాక్షన్ గురించి ఎదురు చూస్తున్నారు. కాగా అరియానాకి ఇన్ స్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో ఆమెను వన్ మిలియన్ మందికి కి పైగా ఫాలో అవుతుడటం విశేషం.