ఫోటో స్టోరి: చెల్లెళ్లతో యంగ్‌హీరో క్రిస్మస్ సెలబ్రేషన్
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ పరిశ్రమలో కథానాయికలుగా దూసుకెళుతున్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ పరిశ్రమలో కథానాయికలుగా దూసుకెళుతున్నారు. జాన్వీ పరిశ్రమలో ఇప్పటికే హీరోయిన్ గా కొనసాగుతుండగా, ఖుషి తన తొలి పెద్ద తెర చిత్రంతో అభిమానుల ముందుకు రానుంది. కథానాయికగా రాణించేందుకు ఖుషీ కపూర్ తన సోదరి జాన్వీ కపూర్ నుంచి సలహాలు సూచనలు తీసుకుంటోంది.
ఇక పోతే ఆ ఇద్దరినీ కంటికి రెప్పలా కాచుకునేందుకు ప్రియమైన అన్నయ్య అర్జున్ కపూర్ ఉండనే ఉన్నాడు. అతడికి తన చెల్లెళ్లంటే వల్లమాలిన అభిమానం. ఎంతో గొప్ప అనుబంధం వారితో ఉంది. తన తల్లిని కోల్పోయిన తర్వాత అర్జున్ తనకు ఏ కష్టం వచ్చినా జాన్వీతోనే చెప్పుకుంటానని అన్నాడు. ఎవరికీ తెలియని రహస్యాలను సైతం జాన్వీకి చెబుతానని అన్నాడు. ఇకపోతే జాన్వీ, ఖుషి పలు సందర్భాల్లో తన సోదరుడు తమను ఎంతో ప్రొటెక్టివ్ గా చూసుకుంటాడని కూడా కితాబిచ్చారు.
తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో అన్నా చెల్లెళ్ల అనుబంధం మరోసారి బయటపడింది. అన్నయ్య అర్జున్ కపూర్ తో కలిసి జాన్వీ, ఖుషి క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఫోటోషూట్ లో అర్జున్ తన క్యూట్ సిస్టర్స్ తో కలిసి ఫోటోలు దిగాడు. జాన్వీ, ఖుషి డిజైనర్ దుస్తులు ధరించి ఎంతో అందంగా కనిపించారు. అర్జున్ సూట్ లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి సంబంధించిన ఫోటోషూట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.