మూడేళ్లుగా అండర్ గ్రౌండ్‌లో డైరెక్టర్.. కారణమిదేనా?
ఇంతకీ అతడు ఎవరు? అంటే... ది గ్రేట్ ఏ.ఆర్.మురుగదాస్. గజిని- స్టాలిన్- ఠాగూర్- స్పైడర్ సహా ఎన్నో భారీ చిత్రాలకు అతడు దర్శకుడు
అతడు సౌత్ - నార్త్ లో అద్భుత చిత్రాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్. మెగాస్టార్ చిరంజీవి, సూర్య, అక్షయ్ కుమార్, రజనీకాంత్, విజయ్ లాంటి టాప్ హీరోలతో పని చేసాడు. ఇంతకుముందు సోనాక్షి సిన్హాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కించాడు. కొన్ని వరుస హిట్లు వచ్చినా కానీ ప్రముఖ హీరోతో తెరకెక్కించిన భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఆ తర్వాత అతడి నుంచి మరో సినిమా రాలేదు. ఏకంగా మూడేళ్ల పాటు గ్యాప్ వచ్చింది. దీనికి కారణం అతడు పూర్తిగా స్క్రిప్టు పనిలో నిమగ్నమవ్వడం.. స్టార్ హీరోలతో క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడం వంటివి ఉన్నాయి. కారణం ఏదైనా కానీ సదరు దర్శకుడు అండర్ గ్రౌండ్ కి వెళ్లాడని గుసగుస వినిపించింది.
అయితే ఇప్పుడు అతడు అండర్ గ్రౌండ్ నుంచి బయటికి వచ్చాడు. వస్తూనే భారీ ప్రయోగాత్మక చిత్రంతో ప్రజల ముందుకు రానున్నాడు. ఇంతకీ అతడు ఎవరు? అంటే... ది గ్రేట్ ఏ.ఆర్.మురుగదాస్. గజిని- స్టాలిన్- ఠాగూర్- స్పైడర్ సహా ఎన్నో భారీ చిత్రాలకు అతడు దర్శకుడు. ఈసారి మురుగదాస్ గురి మారింది. తదుపరి శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ఒక చిత్రానికి దర్శకత్వం వహించడానికి మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే AR మురగదాస్ తొలిగా షారూఖ్ తో ఒక సినిమా చేయాలనుకున్నారు. సినిమా కాన్సెప్ట్ కింగ్ ఖాన్ కి చెప్పాడు. కానీ ఇది వర్కవుట్ కాలేదని తెలిసింది.
నిజానికి కింగ్ ఖాన్ తో పని చేయాలనేది అతడి సుదీర్ఘ కల. 'గజిని' హిందీ వెర్షన్ సక్సెస్ తర్వాత షారుఖ్ ఖాన్‌తో సినిమా చేయాలని ఎఆర్ మురుగదాస్ చాలా ప్రయత్నించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పురోగతిలో విఫలమైంది. AR మురుగదాస్ తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోలతో పని చేసి హిట్లందుకున్నాడు. ఇప్పుడు చాలా కాలానికి ప్రతిభావంతుడైన శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ఒక కొత్త సబ్జెక్ట్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాడని తెలిసింది. రజనీకాంత్ తో దర్బార్ కోసం పని చేసాక ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది. కానీ మురుగ స్తబ్ధుగా ఉన్నాడు. ఎట్టకేలకు శివకార్తికేయన్ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌పై తీవ్రంగా పని చేస్తున్నాడని తెలిసింది.
AR మురుగదాస్ ఇప్పటికే స్క్రిప్టును రెడీ చేసాడు. చాలా కాలం కిందటే రాసుకున్న స్క్రిప్టు కాబట్టి స్క్రీన్‌ప్లేను రివైజ్ చేస్తున్నాడని కూడా తెలుస్తోంది. వాస్తవానికి హిందీ ప్రేక్షకుల కోసం ఉద్దేశించిన స్క్రిప్టు ఇది. అందుకే ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ప్రాధాన్యతలను మెరుగ్గా తీర్చడానికి టైమ్ తీసుకుంటున్నాడు. ఇందులో శివకార్తికేయన్ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుందని, ఈ చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టనుందని సమాచారం. దర్శకుడు మురుగదాస్ ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన తర్వాత సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
అలాగే దళపతి విజయ్‌తో నాలుగో సారి కలిసి పని చేసేందుకు మురుగదాస్ చర్చలు జరుపుతున్నట్లు కూడా కథనాలొస్తున్నాయి. అయితే నిర్మాణ సంస్థతో సృజనాత్మక విభేధాల కారణంగా మురుగదాస్ ప్రాజెక్ట్ నుండి వైదొలిగాడు. మురుగదాస్ మూడేళ్లకు పైగా బ్రేక్‌లో ఉన్నాడు. ఎట్టకేలకు కొత్త ప్రాజెక్ట్ ఖరారైంది. శివకార్తికేయన్ ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామితో కలిసి SK 21 కోసం పని చేస్తున్నాడు. ఇది డిసెంబర్ నాటికి పూర్తవుతుంది.