మొదటి సినిమా దెబ్బకు 11 ఏళ్ల గ్యాప్‌

Update: 2020-12-10 00:30 GMT
సినిమా ఇండస్ట్రీలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలని అంటారు. ఎంతో ప్రతిభ ఉన్నా కూడా అదృష్టం లేకుంటే మాత్రం ఆఫర్లు రావు. అదృష్టం ఉంటే వరుసగా రెండు మూడు ప్లాప్‌ లు పడ్డా కూడా ఇండస్ట్రీలో కొనసాగిన దర్శకులు హీరోలు ఉన్నారు. కాని కొందరు దర్శకులు హీరోలు కేవలం ఒకే ఒక్క ప్లాప్‌ తో కనిపించకుండా పోయిన వారు ఉన్నారు. వారు దురదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఓయ్‌ సినిమాతో దర్శకుడిగా 2009 సంవత్సరంలో పరిచయం అయిన ఆనంద్‌ రంగా ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ కనిపించలేదు. ఆ

ఆ సినిమా కంటెంట్‌ పరంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కమర్షియల్‌ గా ఆడలేదు. అయినా కూడా నిర్మాతలు ఆయనకు ఆఫర్‌ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దాంతో ఆనంద్‌ రంగా తదుపరి ప్రాజెక్ట్‌ కు ఏకంగా 11 ఏళ్లు పట్టింది. ఇప్పటికి చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఈయన్ను నమ్మింది. ఈయనకు షూట్‌ ఔట్‌ అనే వెబ్‌ సిరీస్ దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. సినిమా దర్శకుడిగా నిరాశ పర్చిన ఈ దర్శకుడు వెబ్‌ సిరీస్‌ తో మెప్పిస్తాను అంటున్నాడు. ఈ వెబ్‌ సిరీస్‌ తర్వాత దర్శకుడిగా మళ్లీ వెండి తెరపై కూడా రీ ఎంట్రీ ఇస్తాననే నమ్మకంతో ఉన్నాడు. మరి షూట్‌ ఔట్‌ ఈయన్ను మళ్లీ వెండి తెరపైకి తీసుకు వచ్చేనా చూడాలి.


Tags:    

Similar News