సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కించాలంటే షూటింగ్ లో అన్నిటికంటే ముఖ్యంగా సెట్ చేసుకోవాల్సింది ఆర్ట్ వర్క్. సినిమాలో ఆర్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలాంటి సీన్స్ అయినా ప్రేక్షకుడికి నచ్చాలంటే సిన్ కి తగ్గట్టు వాతావరణం తెరపై కనిపించాలి. అప్పుడే దర్శకుడు చేసే పని సక్సెస్ అవుతుంది. ఇక ప్రస్తుత రోజుల్లో పాత కాలం సినిమాలను తెరకెక్కించాలంటే ఒక సవాల్ అని చెప్పాలి.
మాటల్లో పాటల్లోనే కాకుండా అప్పటి పరిసర వాతావరణం ఎలా ఉండేది అనే దానిపై ముందే అంతా రెడీ చేసుకొని షూటింగ్ స్టార్ చెయ్యాలి. ఆ విధంగా రెడీ చేసుకొని రామ్ చరణ్ తో రంగస్థలం 1985 సినిమాను స్టార్ చేశాడు దర్శకుడు సుకుమార్. 1985 కాలంలో నడిచే ఈ లవ్ స్టోరీలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ స్పెషల్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ముందే చెప్పింది. తప్పకుండా సినిమా 1985లోకి తీసుకెళ్లడం ఖాయమని రీసెంట్ గా రామ్ చరణ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన కొన్ని పోటోలను చూస్తే అర్ధమవుతోంది.
ఆ కాలంనాటి గృహాలు సాధారణ దుకాణాలు 1985ను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా అప్పట్లో ఫెమస్ అయిన గోలి సోడా - గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని పరికరాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సినిమా తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేస్తోందని అంటున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.