నటసింహా నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టబోతోందా? ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ సహా అభిమానుల్లో ఆసక్తికర డిబేట్ ఇది. ఏజ్ గేజ్ తో సంబంధం లేకుండా బాలయ్య పంచ్ పవర్ ని రుచి చూపిస్తున్న తీరుకు అతడిలోని ఎనర్జీకి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్.
ఇప్పటికే అఖండ ట్రైలర్ అంతర్జాలంలో దూసుకెళ్లింది. మునుపటితో పోలిస్తే ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్ ఎంతో బ్యాలెన్సింగ్ గా అలరిస్తాయని కూడా అర్థమవుతోంది. ఇది ఈ సినిమాకి పెద్ద ప్లస్ కానుందని విశ్లేషిస్తున్నారు.
అఖండ ప్రమోషనల్ మెటీరియల్ హీట్ పెంచుతోంది. ఇప్పటికే రెండు టీజర్ లు .. రెండు లిరికల్ పాటలు ప్రజల నుండి మంచి స్పందనను పొందడంతో ఇప్పటికే అంచనాలను పెరిగాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అఖండలో నటించిన ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుపై ఆసక్తికర డిబేట్ వేడెక్కిస్తోంది. అఖండ సన్నివేశాల్లో దర్శకరచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించినట్లు ప్రేక్షకులు హెల్దీ మీమ్స్ తో ఫన్ ని క్రియేట్ చేయడం ఆసక్తికరం. కానీ త్రివిక్రమ్ లా కనిపిస్తున్న ఆయన ఎవరు? అంటే.. అతడు నితిన్ మెహతా.
ఆయన గురించి తెలుసుకోవలసినది చాలా ఉంది. అతడు ఆర్టిస్టు కాక ముందు 21 సంవత్సరాల పాటు భారత సైన్యంలో పని చేశారు. నితిన్ మెహతా ఒక ప్రొఫెషనల్ మోడల్ కావాలనే తన చిరకాల కలను నెరవేర్చుకునేందుకు ఆర్మీ యూనిఫామ్ ను వదులుకున్నాడు. ఆ వృత్తిని విడిచిపెట్టి వచ్చేశారు.
మెహతా ఇప్పుడు తన కలను సరైన సినిమాతో నెరవేర్చుకోబోతున్నారు. అఖండలో కెమెరా ముందు అద్భుతంగా కనిపించారు. మెహతా ఇప్పుడు మోడల్ గా నటుడిగా రాణిస్తున్నారు. అఖండ ట్రైలర్ లో మెహతా ``నేను ఆత్మ.. వాడు నా శరీరం`` అనే డైలాగ్ తో పాటు రెండు సన్నివేశాలు కూడా కనిపించారు. ఇక్కడి నుండి భాషలతో సంబంధం లేకుండా నితిన్ మెహతాకు కచ్చితంగా సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉంది.
అఖండ ట్రైలర్ తర్వాత ఆ నమ్మకం మరింత బలపడింది. వయసుతో సంబంధం లేకుండా నటుడిగా రాణిస్తాడనే భరోసా ఉందిప్పుడు. మెహతా ఆర్మీలో పని చేసినప్పటి నుంచి ఫిట్ నెస్ రొటీన్ ను అనుసరించేవారు. ఆరోగ్యంగా ఉండాలనే అంకితభావమే అతని మోడలింగ్ కెరీర్ లో ముందుకు సాగడానికి సహాయపడింది. ఇదిలా ఉండగా.. అఖండ డిసెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత అతడి ఫేట్ మారుతుందనే అంతా ఊహిస్తున్నారు.