షూటింగ్ లో అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరగడం చాలా కామన్ గా వింటూ ఉంటాం. అయితే ప్రాణాలు పోయే స్థాయి ప్రమాదాలు మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రమాదం తాజాగా బెంగళూరులో జరిగింది. తెలుగు మరియు కన్నడంలో రూపొందుతున్న 'రణం' అనే చిత్రం షూటింగ్ బెంగళూరులోని ఇండస్ట్రీయల్ ఏరియాలో జరుగుతుంది. షూటింగ్ లో భాగంగా ఒక బ్లాస్టింగ్ సీన్ ను ప్లాన్ చేశారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయకుండా బ్లాస్టింగ్ సీన్ ను చిత్రీకరించిన కారణంగా ప్రమాదం జరిగి సుమీర అనే 28 ఏళ్ల యువతి మరియు ఆర్య అనే 8 ఏళ్ల బాలుడు మృతి చెందారు
'రణం' చిత్రంకు వి సముద్ర దర్శకత్వం వహిస్తుండగా చేతన్ మరియు చిరంజీవి సర్జా లు హీరోలుగా నటిస్తున్నారు. వీరిద్దరు కూడా షూటింగ్ లో ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేరు. వీరు లేకుండానే యాక్షన్ సీన్ కు సంబంధించిన బ్లాక్ ను ప్లాన్ చేశారు. షూటింగ్ లో ప్రమాదం విషయం తెలిసి హీరోలు ఇద్దరు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తాము అక్కడ లేని కారణంగా పూర్తి వివరాలు తెలియవు అని, బ్లాస్ట్ కు అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయంపై మాకు అవగాహణ లేదు అని చెప్పుకొచ్చారు.
మరో వైపు బ్లాస్ట్ కు సంబంధించిన అనుమతి తీసుకోలేదు అంటూ బెంగళూరు అధికారులు అంటున్నారు. పూర్తి భద్రత చర్యలు తీసుకోకుండానే షూటింగ్ లో బ్లాస్టింగ్ సీన్ ను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమిక విచారణలో తేల్చారు. ఈ చిత్రం ప్రమాదానికి సంబంధించి నిర్మాత మరియు దర్శకుడిపై కేసు నమోదు అయ్యింది. ఇంకా కొందరిపై కూడా కేసులు పెట్టినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం తెలుగు మరియు కన్నడ సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.