వామ్మో.. ఒక్క సెట్టింగుకే 20 కోట్లా?

Update: 2016-02-15 11:30 GMT
బాహుబలి రెండు భాగాలకు కలిపి రూ.250 కోట్ల బడ్జెట్ అంటేనే ఆశ్చర్యపోయాం. కానీ రోబో-2 ఒక్క సినిమాకే రూ.400 కోట్ల బడ్జెట్ అని డిసైడ్ చేశాడు శంకర్. మరి అన్ని కోట్లు శంకర్ ఎలా ఖర్చు చేస్తాడు? మరీ ఇంత మొత్తంలో డబ్బు పెట్టేంత అవసరం ఏముంటి? అన్న సందేహాలు రావడం సహజం. ఐతే శంకర్ ఏది కూడా ఊరికే చేయడు. ఆయన ఎంత ఖర్చు పెట్టినా ఆ భారీతనమంతా తెర మీద కచ్చితంగా కనిపిస్తుంది. రోబో-2 విషయానికే వస్తే ప్రతి సన్నివేశం కూడా కళ్లు చెదిరేలా ఉండేలా డిజైన్ చేసి పెట్టుకున్నాడట శంకర్. కేవలం ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం వేస్తున్న సెట్టింగుకే రూ.20 కోట్లు ఖర్చు పెడుతుండటం భారతీయ సినీ వర్గాలన్నింటినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

చెన్నై సమీపంలోని పూనమల్లీ అనే ప్రాంతంలో రోబో-2 కోసం రూ.20 కోట్ల ఖర్చుతో భారీ సెట్టింగ్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 18 నుంచి అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నాడు శంకర్. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేశాడు. అతనిప్పటికే చెన్నైకి చేరుకుని ఈ సీక్వెన్స్ చిత్రీకరణకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ల మీద ఈ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారు. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ సీక్వెన్స్ తెరకెక్కించాలని భావిస్తున్నాడట శంకర్. సినిమా కూడా భారతీయ సినిమాకు హై స్టాండర్డ్స్ సెట్ చేయడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి ‘రోబో-2’ మరోసారి తనేంటో చూపించేలాగే ఉన్నాడు శంకర్.
Tags:    

Similar News