షాక్ : 30కోట్ల సెట్టింగా.. జాన్ బ‌డ్జెట్ ఎంత‌?

Update: 2019-05-17 09:04 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ ఒకేసారి రెండు క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాడు. ఓవైపు సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ సినిమా `సాహో`లో న‌టిస్తూనే... మ‌రోవైపు జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో జాన్ (వ‌ర్కింగ్ టైటిల్) చిత్రంలో న‌టిస్తున్నాడు. సాహో దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ సినిమా. అయితే దాంతో పోలిస్తే జాన్ చిత్రం పూర్తిగా విభిన్న నేప‌థ్యం ఉన్న సినిమా. ఇది ఓ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. 1970 కాలంలో సాగే ఉద్విగ్న‌భ‌రిత‌మైన ప్రేమ‌క‌థా చిత్రం అని తొలి నుంచి ప్ర‌చార‌మవుతోంది. అయితే జాన్ భారీ బ‌డ్జెట్ చిత్రం అంటూ ఏనాడూ ప్ర‌చారం అయితే సాగ‌లేదు. కానీ ఈ సినిమా కి ఖ‌ర్చు చేస్తున్న తీరును ప‌రిశీలిస్తే.. ఒక్కో అప్ డేట్ అంత‌కంత‌కు హీటెక్కిస్తున్నాయి. ఓ ర‌కంగా ప్ర‌భాస్ కెరీర్ లో సాహో త‌ర్వాత మ‌ళ్లీ అంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న సినిమా ఇదేనా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారంతా.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. జాన్ కోసం 30 కోట్ల‌తో హైద‌రాబాద్ లో ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. ఈ సెట్ లో ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నారు. వాస్త‌వానికి యూర‌ప్ లోని కొన్ని అరుదైన లొకేష‌న్ల‌లో ఈ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించాల్సి ఉండ‌గా... భారీగా యూనిట్ స‌భ్యుల్ని త‌ర‌లించాల్సి వ‌స్తుండ‌డంతో జాన్ టీమ్ దానిని విర‌మించుకుందిట‌. ప్ర‌త్యామ్నాయంగా హైద‌రాబాద్ లోనే యూరప్ వాతావ‌ర‌ణాన్ని ఎలివేట్ చేస్తూ సెట్స్ ని డిజైన్ చేశారు. ఇందుకోసం ఏకంగా మూప్ప‌య్ కోట్లు ఖర్చు చేస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ తో క‌లిసి యువిక్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. తొలుత అనుకున్న బ‌డ్జెట్ తో సంబంధం లేకుండా ఓవ‌ర్ బ‌డ్జెట్ అవుతోందా? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది.

పూజా హెగ్డే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 2020 స‌మ్మ‌ర్ కానుక‌గా సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రోవైపు `సాహో` చిత్రాన్ని ఈ ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్న సంగ‌తి త‌లిసిందే. కేవ‌లం ఏడెనిమిది నెల‌ల గ్యాప్ తోనే ప్ర‌భాస్ త‌న అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సాహో.. జాన్ చిత్రాలు 2019-20 మోస్ట్ అవైటెడ్ జాబితాలోకి చేర‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

    

Tags:    

Similar News