రోబో శంకర్ దర్శకత్వం వహిస్తున్న విజువల్ ఫీస్ట్ గా `2.ఓ` (రోబో2) పాపులరైంది. ఈ చిత్రానికి జనంలో క్రేజు నెలకొందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంకేతిక కారణాల వల్ల - కొన్ని తప్పిదాల వల్ల రిలీజ్ అంతకంతకు వాయిదా పడుతున్నా శంకర్ ఏదో చేస్తున్నాడన్న నమ్మకం ఇటు మార్కెట్ వర్గాల్లోనూ ఉంది. రాజీ అన్నదే లేకుండా దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తీరు చూస్తుంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి వేరొక సినిమా ఇప్పట్లో రాబోదన్న అంచనాలేర్పడ్డాయి. అన్ని సందేహాలు తొలగిపోయాయి... ఇక నవంబర్ 29న రిలీజ్ ఖాయం అంటూ శంకర్ ప్రకటించడంతో జనం కొంతలో కొంత శాంతించారు. ఇదంతా రోబో లాంటి మరో విజువల్ వండర్ ని చూడాలన్న అభిమానుల ఆత్రంగానూ భావించాలి.
అయితే ఈ సినిమాకి లీకుల బెడద ఏంటో! అంటూ రెండు సార్లు పెద్ద హంగామానే జరిగింది. ఇదివరకూ ఓ ప్రివ్యూ థియేటర్ నుంచి ఓ లీక్డ్ టీజర్ బయటకు రావడం సంచలనమైంది. మా ప్రతినిధులు చూస్తుండగా ఇలా జరిగిందిలే అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అదంతా బూటకం.. జస్ట్ చెకింగ్ కోసం ఇలా కావాలనే లీక్ చేశారని జనం చెవులు కొరుక్కున్నారు. అదలా అయితే.. ఇటీవల ఉన్నట్టుండి మేకింగ్ వీడియో లీకైందంటూ బీబీసీలో భారీ కథనం వెలువడడం మరోసారి సంచలనమైంది. అయితే ఈ లీక్‌పైనా జనం ఎవరికి వారు విసుర్లు విసిరేస్తున్నారు.
ప్రచారం కోసం లీకేజీ టెక్నిక్‌ని శంకర్ బృందం వాడేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ లీక్డ్ ఫుటేజ్ లో ఎక్కడా సినిమాకి సంబంధించిన కీలక సమాచారం ఏదీ లీక్ కాలేదు. కేవలం ఎమీజాక్సన్ లుక్ ఎలా ఉంటుంది? లేడీ రోబోట్ ప్రవర్తన ఎలా ఉంటుంది? అన్నది లీకైంది. అలానే చిట్టీ ఈజ్ బ్యాక్! అన్న సిగ్నల్ ని బయటకు పంపడం ద్వారా ఈ సినిమాపై హైప్ పీక్స్ కి తీసుకెళ్లాలన్న తపన లీకేజీలో కనిపించింది. ఇదివరకూ టీజర్ లీక్ కూడా కావాలని చేసిందే. వాళ్ల మనుషులే రిలీజ్ చేసి ఇలా నాటకాలాడుతున్నారు. ఇదంతా జనం ఒపీనియన్ తీసుకునే తుంటరి ఆలోచన అంటూ విశ్లేషిస్తున్నారు. మొత్తానికి బీబీసీ లీకేజీ కూడా అంతా ట్రాష్. అది శంకర్ బృందం తీసుకెళ్లి అందించిన ఒరిజినల్ ఫుటేజీ అని అర్థమవుతోంది. మొత్తానికి ఎవరు ఏ నాటకం ఆడినా అది సినిమాపై హైప్ తీసుకొచ్చేందుకే. మర్చిపోతున్న 2.ఓని పిలకపట్టుకుని ఝాడించడమేనన్నమాట!!