రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం అంటే 2002 నవబర్ 11న `ఈశ్వర్` సినిమాతో ప్రభాస్ నట ప్రస్థానం మొదలైంది. జయంత్ సీ. పరాన్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ హీరోగా ప్రభాస్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కృష్ణంరాజు నట వారసుడిగా తెరంగేట్రం చేసిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని, భారతీయ సినీ వినీలాకాశంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటాడని ఎవరూ ఊహించి వుండరు. ఈ విషయం ప్రభాస్ కూడా ఊహించి వుండడు.
చిన్న హీరోగా 20 ఏళ్ల క్రితం కెరీర్ మొదలు పెట్టిన ప్రభాస్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `బాహుబలి` సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ లని సొంతం చేసుకుని టాలీవుడ్ కు సరికొత్త వెలుగుల్ని తీసుకొచ్చాడు. ఈ సిరీస్ సినిమాలతో టాలీవుడ్ దశను, దిశను మార్చిన ప్రభాస్ ఇండియన్ సినిమాలో టాలీవుడ్ ని పతాక స్థాయిలో నిలబెట్టాడు. ఇండియన్ సినిమాలో వున్న ప్రధాన స్టార్లలో ఒకడిగా నిలిచాడు.
అంతే కాకుండా భారతీయ సినీ చరిత్రలో పాన్ ఇండియా హీరోగా ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటూ భారతీయ నటుల్లో అత్యధిక స్థాయిలో పారితోషికాన్ని దక్కించుకుంటున్న హీరోల్లో ముందు వరుసలో నిలిచాడు. గడిచిన 20 ఏళ్ల తర సినీ ప్రస్థానంలో ప్రభాస్ దక్కించుకున్న మైలు రాళ్లు ఎన్నో. అయితే అతని కెరీర్ లో ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోయే సినిమా `బాహుబలి`. ఈ మూవీతో యావత్ దేశ వ్యాప్తంగా క్రేజ్ ని దక్కింకున్న ప్రభాస్ ప్రస్తుతం ఆ క్రేజ్ కి తగ్గ సినిమాల్లో నటిస్తున్నాడు.
ఎన్ని సినిమాల్లో నటించినా ప్రభాస్ కు `ఈశ్వర్` ఎప్పటికీ ప్రత్యేక సినిమాగానే నిలిచిపోయింది. ధూల్ పేట యువకుడిగా ప్రభాస్ నటించిన ఈ మూవీ అతన్ని యాక్షన్ హీరోగా నిలబెట్టడం విశేషం. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో తను నటిస్తున్న తొలి మైథలాజికల్ డ్రామా `ఆది పురుష్` షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న `సలార్`, నాగ్ అశ్విన్ తో చేస్తున్న `ప్రాజెక్ట్ కె`, మారుతి డైరెక్షన్ లో చేస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రీకరణ దశలో వున్నాయి.
త్వరలో మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రభాస్ తో ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. `వార్`, పఠాన్ చిత్రాల దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలు `బిల్లా`, ఛత్రపతిచ వర్షం, మిర్చి, బాహుబలి 1 అండ్ 2.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.