'సాహో' చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఈ శ్రీలంకన్ బ్యూటీ ప్రధానంగా హిందీ పరిశ్రమలో బిజీ నాయికగా కొనసాగుతోంది. మరోవైపు జాక్విలిన్ ఒక మోసగాడితో స్నేహం చేసిన పర్యవసానం గురించి మీడియా హెడ్ లైన్స్ లో కథనాలు సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే.
నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు మోసగాడైన (కాన్ మన్) సుఖేష్ చంద్రశేఖర్ తో సంబంధాలున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. నవంబర్ 15 న జాకీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
విచారణ పూర్తయి చార్జిషీటు దాఖలైనందున కస్టడీ అవసరం లేదని జాక్విలిన్ కోర్టులో అప్పీలు చేసింది. ఇప్పుడు తాజా అప్ డేట్ ప్రకారం ఢిల్లీ కోర్టు కేసు విచారణను డిసెంబర్ 12కి వాయిదా వేసింది. విచారణ కోసం జాకీ కోర్టుకు హాజరయ్యారు.
స్టార్ హీరోయిన్ వద్ద డబ్బు పుష్కలంగా ఉంది కాబట్టి దేశం నుండి తప్పించుకోవచ్చని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతంలో పేర్కొంది. జాక్వెలిన్ తో పాటు నోరా ఫతేహిని కూడా ఈడీ చాలాసార్లు ప్రశ్నించింది. సెప్టెంబర్ లో జాక్వెలిన్ స్టైలిస్ట్ లీపాక్షి ఎల్లవాడి రూ. 3కోట్లను మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ నుండి ఆధారాలతో ఆరోపించారు.
ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి దోపిడీ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సుకేష్ చంద్రశేఖర్.. అతడి భార్య లీనా మారియా పాల్ లను ED అరెస్టు చేసింది. జాక్వెలిన్ ఆ మోసగాడితో డేటింగ్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా మీడియాలో వైరల్ అయ్యాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాక్వెలిన్ చివరిగా అక్షయ్ కుమార్ 'రామసేతు'లో కనిపించింది. ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ అందుకుంది. కోర్టు కేసులతో సంబంధం లేకుండా జాక్విలిన్ కి అవకాశాలొస్తున్నాయి. కానీ మునుపటితో పోలిస్తే ఆశించినంత భారీ అవకాశాలు లేవు. విచారణలో సుకేష్ తో జాక్విలిన్ సంబంధాలపై లోతుగా ఆరాలు తీస్తున్న క్రమంలో పలు నిజాలు బట్టబయలైన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.