2015 నేటితో ముగుస్తోంది. రేపటి నుంచి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేస్తున్నాం. ఈ ఏడాదిలో వివాదాలేంటి? అనూహ్య ఘటనలేంటి పునశ్చరణ చేసుకుంటే బోలెడన్ని సంగతులున్నాయ్. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభంలోనే త్రిష మ్యారేజ్ - నిశ్చితార్థంకి సంబంధించిన వార్తలు టాప్ స్లాట్ లో నిలిచాయి. అనూహ్యంగా వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం జరిగిపోవడం, అటుపై పెళ్లికి బాజా మోగుతుంది అనుకుంటున్న టైమ్ లో ఆ పెళ్లి తిరస్కారానికి గురవ్వడం కాస్తంత బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ అయ్యింది. త్రిష అభిమానుల్ని కలతకు గురి చేసిన ఇన్సిడెంట్ ఇది. అయితే త్రిష ఇవేమీ పట్టనట్టుగా తన పని తాను చేసుకుపోయింది.
ఇక విశ్వనటుడు కమల్ హాసన్ పలు విషయాల్లో వివాదాల్ని నెత్తినేసుకోవాల్సొచ్చింది. తమిళనాట ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న జల్లికట్టు క్రీడను సమర్ధిస్తూ కమల్ మాట్లాడారు. అలాగే కొందరు ప్రముఖులు అవార్డులు వెనక్కి ఇచ్చేస్తుంటే.. వాటితో పాటే వచ్చిన రివార్డుల్ని కూడా వెనక్కి ఇచ్చేయాలని కాంట్రవర్శియల్ స్పీచ్ ఇచ్చారు. అభిమానంతో ప్రతిభను గుర్తించి ఇచ్చే అవార్డుల్ని వెనక్కి ఇచ్చేయనక్కర్లేదని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. దీనిపై పలువురు మండిపడ్డారు. ఇటీవలి కాలంలో చెన్నయ్ వరద ముంపు సమయంలో ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రశ్నించి జయమ్మ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఏడాది అతడి సినిమాలన్నీ రిలీజ్ విషయంలో ఎన్నో చిక్కుల్ని ఎదుర్కోవాల్సొచ్చింది. ఇంటోలరెన్స్ విషయంలోనూ కమల్ తన మనసులో ఉన్న మాటని నిక్కచ్ఛిగా చెప్పేసి వివాదానికి కారణమయ్యాడు. ఇకపోతే ఆయన తనయ శ్రుతిహాసన్ పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఓ సినిమా నుంచి అనూహ్యంగా తప్పుకుని వివాదానికి కారణమైంది. కోర్టు గొడవ వరకూ వెళ్లింది ఈ ఇష్యూ.
ఇరాన్ మూవీ ముహమ్మద్: మెసెంజర్ ఆఫ్ గాడ్ విషయంలో ఏ.ఆర్.రెహమాన్ పై ఫత్వా విధించింది ఓ ముస్లిమ్ తెగ. దేవుడిని అపవిత్రం చేస్తున్న హిందువు అంటూ అతడిపై ఫైరైంది సదరు తెగ. పరమత అసహనం విషయంలోనూ బోలెడంత టాపిక్ వచ్చింది రెహమాన్ పై. అలాగే ఈర్ ఎండ్ లో శింబు - అనిరుధ్ అనుకోకుండా ఓ వివాదాన్ని నెత్తికెత్తుకున్నారు. అసలే శింబు అష్టకష్టాల్లో ఉన్న టైమ్ లో ఉరుమొచ్చి మీదపడినట్టు బీప్ సాంగ్ వచ్చి మీద పడింది. పచ్చి బూతులతో లిరిక్ రాసినందుకు శింబుపైనా, దానికి కంపోజర్ గా పనిచేసినందుకు అనిరుధ్ పైనా మహిళా మండళ్లు ఫైరైపోయాయి. క్రిమినల్ కేసులు పెట్టి రచ్చకీడ్చాయి. ప్రస్తుతం ఈ ఇష్యూ నలుగుతూనే ఉంది. అలాగే ఏడాది చివరిలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఇన్ టోలరెన్స్ విషయంలో కామెంట్ చేసి అడ్డంగా బుక్కయిపోయాడు. ఇలా చూస్తే ఏడాదంతా ఇవన్నీ మేజర్ ఇన్సిడెంట్స్.