తెలుగు లోగిళ్లు గొబ్బెమ్మలతో వెలిగిపోయే సంక్రాంతి పండుగ వచ్చిందంటే పల్లెలనుంచి పట్నాల వరకు సందడే సందడి. పండుగ నాడు కొత్త అల్లుళ్లతో....కొత్త ధాన్యాలతో...కోడి పందేలతో గ్రామాలు కళకళలాడుతుంటాయి. అదే సమయంలో పండుగ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా చేయడానికి తెలుగు చిత్రాలు విడుదలవుతుంటాయి. ఓ రకంగా టాలీవుడ్ లోని కొందరు హీరోలకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి బాగా కలిసి వచ్చింది. ఈ సారి కూడా సంక్రాంతి బరిలో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు బయోపిక్ `ఎన్టీఆర్`తో బాలయ్య బాబు సంక్రాంతి బరిలో దిగనున్నాడు. మరోవైపు, తన 25వ చిత్రంతో మహేష్ మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. వీరిద్దరితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సంక్రాంతి రేసులోకి రాబోతున్నాడు.
ఈ సారి సంక్రాంతి బరిలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. బాలకృష్ణ నటిస్తూ, సహనిర్మాతగా వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9న విడుదల కానుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ తో హిట్ కొట్టాలని బాలయ్య బాబు భావిస్తున్నాడు. మరోవైపు - బోయపాటి శ్రీను - చరణ్ ల కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి - మహేష్ ల కాంబోలో రాబోతోన్న చిత్రం షూటింగ్ నిన్న డెహ్రాడూన్ లో ప్రారంభమైమంది. 4 నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి... మిగతా సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కు కేటాయిస్తారట. రాబోయే సంక్రాంతి బరిలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. మరి వచ్చే ఏడాది సంక్రాంతి సెంటిమెంట్ ఎవరికి వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.