2022 బాలీవుడ్ బ్ర‌హ్మాస్ర్త‌కి రాసిచ్చేసిందా!

Update: 2022-09-05 06:32 GMT
స‌రైన స‌క్సెస్ లు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ వీకైపోయిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన చిత్రాల‌న్ని వ‌రుస‌గా ఒక‌దానికొక‌టి పోటీ ప‌డి మ‌రీ బోల్తా కొట్టాయి. 'లాల్ సింగ్ చ‌డ్డా'..'ర‌క్షాబంధ‌న్' చిత్రాలు సైతం ఇదే వ‌రుస‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ కిప్పుడు ఓ స‌క్సెస్ అవ‌స‌రం. ఆ విజ‌యం బ్ర‌హ్మాస్ర్త రూపంలో ద‌క్కుతుంద‌ని ప‌రిశ్ర‌మ ఎన్నో అంచ‌నాలు పెట్టుకుంది.

వాటికి త‌గ్గ‌ట్టే  చిత్రం సెప్టెంబ‌ర్ 9న సినిమా రిలీజ్ అవుతుంది. అటు చిత్ర యూనిట్ పెద్ద ప్ర‌చారం చేస్తుం ది. భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమా కావ‌డం స‌హా..ర‌ణ‌బీర్ అలియా జంట న‌టించిన సినిమా కావ‌డంతో భారీ ఓపెనింగ్స్ ద‌క్కే అవకాశం ఉంద‌న్న‌ది నిపుణుల అంచ‌నా! మ‌రి వాటికి ద‌గ్గ‌ర‌గానే బ్ర‌హ్మ‌స్ర్త క‌నిపిస్తుందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

చాలా కాలం తర్వాత బ్ర‌హ్మాస్ర్త‌ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్  ప్రోత్సాహకరంగానే క‌నిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం  బ్రహ్మాస్త్ర ఈ సంవత్సరంలో అత్యుత్తమ ఓపెనింగ్‌ను ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తుంది.  కార్తీక్ ఆర్యన్ న‌టించిన 'భూల్ భూలయ్యా 2' ప్రారంభ రోజున దాదాపు 15 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కూ ఇదే హాయ్య‌స్ట్ ఓపెనింగ్ వ‌సూళ్ల‌గా నిలిచింది. అయితే ఆ రికార్డును  బ్రహ్మాస్త్ర బ్రేక్ చేస్తుంద‌ని అంటున్నారు. ఈ సినిమాకి  20 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఓపెనింగ్స్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ అంచనా వేస్తుంది.

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన  'లాల్ సింగ్ చద్దా'.. 'రక్షా బంధన్ ' ..'బచ్చన్ పాండే' వంటి పెద్ద చిత్రాలు కూడా 'భూల్ భూలయ్యా 2' ప్రారంభోత్సవాన్ని అధిగమించలేకపోయాయి. ఈ నేప‌థ్యంలో అంత‌టి స‌త్తా బ్ర‌హ్మాస్ర క‌లిగి ఉంద‌న్న‌ది ఓ అంచ‌నా గా క‌నిపిస్తుంది.  రాబోయే కొద్ది వారాల్లో హృతిక్ రోషన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న  'విక్రమ్ వేద' పై  మంచి అంచనాలున్నాయి.

అయితే ఈ సినిమా కూడా బ్రహ్మాస్త్ర .. భూల్ భూలయ్యా 2 యొక్క ఓపెనింగ్‌ను కూడా బీట్ చేయకపోవచ్చని బాలీవుడ్ వ‌ర్గాలు గెస్ చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది ఏ సినిమాకి కూడా అంత‌టి స‌త్తా లేద‌ని సైతం ట్రేడ్ అంచ‌నా వేస్తుంది.

2023లో మాత్రం  బ్రహ్మాస్త్ర రికార్డును ప్ర‌భాస్  'ఆదిప్రరుష్ ..ఆ త‌ర్వాత రిలీజ్ అయ్యే  పఠాన్ బ్రేక్ చేస్తాయ‌ని ట్రేండ్ పండితులు చెబుతున్నారు. మ‌రి బ్ర‌హ్మ‌స్ర్త ట్రేడ్ అంచ‌నాల్ని నిజం చేస్తుందా?  లేదా? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత డిసైడ్ అవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News