కాలగమనంలో మరో ఏడాది కలిసి కాబోతుంది. 2022 సంవత్సరం మరి కొన్ని రోజులు అయితే పూర్తి అయ్యి 2023వ సంవత్సరం రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో 2022 సంవత్సరం ఇండియన్ సినీ పరిశ్రమకు ఎంత వరకు కలిసి వచ్చింది.. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పరిస్థితి ఏంటీ అనేది అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
2021 సంవత్సరం కరోనా కారణంగా ఎక్కువ శాతం రోజులు థియేటర్ లు మూత పడి ఉన్నాయి. అందుకే గత ఏడాది పెద్దగా భారీ చిత్రాలు వచ్చింది లేదు. ఏడాది చివర్లో వచ్చిన కొన్ని సినిమాలు సందడి చేశాయి. అవి కూడా సౌత్ సినిమాలే అనే విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది కూడా సౌత్ సినిమాల జోరు కొనసాగింది.
బాలీవుడ్ సినిమాల యొక్క సక్సెస్ రేటు మరీ దారుణంగా ఉంది. థియేట్రికల్ రిలీజ్ చేయాలి అంటే భయపడే స్థాయిలో బాలీవుడ్ సినిమా ఉంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల సినిమా పరిశ్రమలతో పోల్చితే తెలుగు సినిమా పరిశ్రమ ఉత్తమం.
ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాలు కేజీఎఫ్.. ఆర్ ఆర్ ఆర్.. విక్రమ్.. కాంతార మరియు కార్తికేయ 2. ఈ సినిమాలు మాత్రమే కాకుండా హిందీలో కూడా ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. సౌత్ ఇండియన్ సినిమాలే హిందీలో కూడా వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే.
2022 సంవత్సరంలో ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే... ఈ ఏడాదిలో వచ్చిన సీక్వెల్స్ కు మంచి సక్సెస్ దక్కింది. దృశ్యం 2 మొదలుకుని కార్తికేయ 2.. హిట్ 2.. కేజీఎఫ్ 2.. సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ బంగ్రారు సినిమాలు సక్సెస్ అయ్యాయి. బాలీవుడ్ లో కూడా భూల్ భులయ్య సినిమా సీక్వెల్ కు సక్సెస్ టాక్ దక్కింది.
అంతకు ముందే విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలకు సీక్వెల్ ను తీసుకు రావడం వల్ల పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. అదే సమయంలో సినిమా కు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కనుక ఈ ఏడాది మాదిరిగానే వచ్చే ఏడాదిలో కూడా సీక్వెల్స్ ఎక్కువ రావాలని.. అవి సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.