టూరిస్ట్ గా వచ్చి బ్రిటీష్ యువరాణి అయ్యింది..

Update: 2018-05-22 09:28 GMT
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ.. అమెరికన్ నటి మేఘన్ మార్కెల్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా బ్రిటన్ లోని రాయల్ వెబ్ సైట్ మేఘన్ గురించి ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.  బ్రిటీష్ యువరాణిగా మేఘన్ కావడం వెనుక ఒక పర్యటనే కారణమని  పేర్కొంది.

ప్రస్తుతం ఈ బ్రిటీష్ యువరాణి గురించి సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. మేఘన్ అందరూ టూరిస్టులలాగానే తన 15వ ఏట బ్రిటీష్ రాజకుటుంబం నివసించే ‘బంకింగ్ హమ్ ప్యాలెస్’ ఓ సారి పర్యాటకురాలిగా వచ్చింది. అప్పుడే బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ ను కలుసుకొంది. అక్కడే  కొన్ని ఫొటోలు కూడా దిగిందట.. 22 ఏళ్ల కిందట జరిగిన ఈ పరిణామం తర్వాత ఇప్పుడు తాజాగా అదే ప్యాలెస్ కు యువరాణిగా వచ్చేసింది మేఘన్..

అదృష్టం మేఘన్ కు బాగా ఉండి ఇప్పుడు యువరాణి అయ్యింది.. నిజానికి బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ  - మేఘన్ లు ఒకరికి ఒకరు వ్యక్తిగత పరిచయం లేదు.. అమెరికాలో మేఘన్ నటించిన సీరియల్స్ ని - సినిమాల్నీ హ్యారీ ఎప్పుడూ చూడలేదట.. మేఘన్ కు కూడా బ్రిటన్ రాజకుటుంబం గురించి పెద్దగా అవగాహన లేదు. ఇద్దరూ తమకు ఉన్న కామన్ స్నేహితుల ద్వారా రెండేళ్ల క్రితం పరిచయమయ్యారు. అలా పరిచయం సహజీవనానికి దారి తీసి ఒకరినొకరు తెలుసుకొని ఇప్పుడు ఒక్కటయ్యారు.. ఇలా 22 ఏళ్ల క్రితం యాదృశ్చికంగా బ్రిటీష్ రాజప్రసాదానికి  వచ్చిన మేఘన్ ఇప్పుడా ప్యాలెస్ కే యువరాణి కావడం విశేషంగా చెప్పవచ్చు.  

బ్రిటన్ కు యువరాణిగా అయ్యాక మేఘన్ కూడా చాలా మారింది. ఆమె తన నటనకు స్వస్తి చెప్పింది. అంతేకాదు.. రాణి కావడంతో తన సోషల్ మీడియా ఖాతాలను కూడా తీసేసింది. అంతేకాదు బ్రిటన్ రాజకుటుంబం చేస్తున్న చారిటీ సేవలను ప్రస్తుతం మేఘన్ చూసుకుంటోంది.

Tags:    

Similar News