నేమ్ ప్లేట్ అనేది ఇండెక్స్ ఆఫ్ ది పర్సనాలిటీ అనాలేమో! లగ్జరీ విలాసానికి సింబాలిక్ ఇది. అది కార్ నేమ్ ప్లేట్ అయినా లేదా ఇంటికి ఉపయోగించే నేమ్ ప్లేట్ అయినా సంఘంలో స్టాటస్ ని ఎలివేట్ చేసేలా ఉండాలని కోరుకుంటారు. రిలయన్స్ అంబానీలు అంటిల్లా నిర్మించినా కార్ కొనుక్కున్నా వాటికి నేమ్ ప్లేట్ కోసం భారీ బడ్జెట్లు వెచ్చించారని కథనాలొచ్చాయి.
ఇక బాలీవుడ్ లో పలువురు స్టార్లు నేమ్ ప్లేట్ కోసం లక్షల్లో వెచ్చించడం తెలిసినదే. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కి ఇది కొత్తేమీ కాదు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ఖాన్ దేశంలోని అతిపెద్ద స్టార్లలో ఒకడు. అతడు నివశించే స్వర్గధామం మన్నత్ కి ఉన్న క్రేజ్ వేరు.
అతని బంగ్లా ఇప్పుడు ముంబైకి వచ్చే వారందరికీ అధికారిక పర్యాటక ప్రదేశంగా మారింది. SRK బంగ్లా ఇప్పుడు గత కొన్ని రోజులుగా పునరుద్ధరణ మోడ్ లో ఉంది. ఈ ఫోటోలో చూస్తుంటే ఒక విషయం అర్థమవుతోంది. ఆ నేమ్‌ప్లేట్ కొత్తది. ఇటీవలే మార్చారు. దీనికోసం కొత్త లగ్జరస్ డిజైన్ ఎంచుకున్నారు.
ఈ నేమ్‌ప్లేట్ ను SRK భార్య ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ రూపొందించారు. దీని ఖరీదు 25 లక్షలు. ఇది యూరప్ నుండి దిగుమతి చేసుకున్న ప్రత్యేక రాయితో తయారు చేసినది. ఈ కొత్త డిజైన్ దగ్గర సెల్ఫీలు తీసుకోని ప్రజలు అభిమానులు సంబర పడుతున్నారు. అంతటి ఆకర్షణతో ఉంది ఆ రాక్ సాలిడ్ నేమ్ ప్లేట్.
ఆసక్తికరంగా ఈ సందర్భంలో మనం పరిశీలించాల్సిన వేరొక పాయింట్ ఉంది. కింగ్ ఖాన్ ఇంటి ముందు నేమ్ ప్లేట్ లాంటివి ఏవీ లేకపోయినా కానీ హైదరాబాద్ లో ప్రభాస్ ఇంటి ముందు క్యూ కట్టి విదేశీ వనితలు యువతరం ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు పోటీపడిన సందర్భం గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే షారూక్ కంటే చాలా ఆలస్యంగా పాన్ ఇండియా స్టార్ అయినా కానీ ప్రభాస్ కి అసాధారణ క్రేజ్ ఒక్క సినిమాతోనే వచ్చింది. బాహుబలుడిగా ఖాన్ లకు లేని క్రేజ్ అతడికి ఉంది. ఇప్పటికిప్పుడు ప్రభాస్ నటిస్తున్న సినిమాలు బాలీవుడ్ లో ఖాన్ లకే సవాల్ గా మారనున్నాయన్న విశ్లేషణ సాగుతోంది.
షారూక్ నటిస్తున్న తదుపరి చిత్రం పఠాన్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇంతలోనే అట్లీతో షెడ్యూల్ లో బిజీ అయ్యాడు. తర్వాత రాజ్ కుమార్ హిరాణీతో మరో భారీ చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నాడు. కెరీర్ లో సరైన హిట్టు లేక డీలా పడిపోయిన ఖాన్ పఠాన్ తో కంబ్యాక్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు