2.0: అక్కడ హిట్టయిన చిట్టి రోబో

Update: 2018-12-06 04:26 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబినేషన లో తెరకెక్కిన '2.0' నవంబర్ 29 న విడుదలయిన సంగతి తెలిసిందే.  భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటివారం లో భారీ కలెక్షన్స్ ఫిగర్స్ నే నమోదు చేసిది. ముఖ్యంగా హిందీ వెర్షన్ ఇప్పటి కే ప్రాఫిట్ జోన్లో కి ఎంటర్ కావడం విశేషం.

హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ను కరణ్ జోహార్ దాదాపు రూ.70 కోట్ల కు సొంతం చేసుకున్నాడని సమాచారం.  ఈ సినిమా ఇప్పుడు ఆరు రోజులకు గానూ రూ. 122 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో కరణ్ పెట్టిన పెట్టుబడి  డిస్ట్రిబ్యూటర్ షేర్ రూపంలో వెనక్కు వచ్చేసింది. హిందీ వెర్షన్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా రన్ అవుతుండడంతో ఇక పై వచ్చే వసూళ్ళన్నీ లాభాలే.  రజనీ - శంకర్ కాంబినేషన్ కంటే కూడా అక్షయ్ కుమార్ ఫ్యాక్టర్ హిందీ వెర్షన్ కు చాల ప్లస్ అయిందని అందుకే వసూళ్లు ఇంకా నిలకడగా ఉన్నాయని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు.

సినిమా రిలీజు కు ముందు సౌత్ లో బిగ్ హిట్ అవుతుందని నార్త్ లో పెద్ద గా ఆసక్తి వ్యక్తం కాకపోవచ్చని కొంతమంది అన్నారు. కానీ ఇప్పడు పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నార్త్  లో సినిమా జోరుగా దూసుకుపోతుంటే  సౌత్ లో అన్ని వెర్షన్లు నష్టాల దిశగా పయనిస్తున్నాయి.  ఉన్నంత లో తెలుగు వెర్షన్ కు కలెక్షన్స్ మెరుగ్గా ఉన్నాయి.
Tags:    

Similar News