అదేంటి చిరంజీవి వయసు ఆల్రెడీ అరవై దాటేసిందిగా కొత్తగా ఈ ముప్పై ఏంటి అనుకుంటున్నారా. అక్కడే ఉంది మతలబు. వ్యక్తిగా కొణిదెల శివశంకర వరప్రసాద్ గా ఆయన వయసు 60 ప్లస్ నిజమే కానీ మెగాస్టార్ అనే నామకరణం ఆయన పేరుకు ముందు టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది మాత్రం ఈ రోజే. 1988లో ఆగస్ట్ 4న మరణమృదంగం విడుదల సందర్భంగా నిర్మాత కెఎస్ రామారావు మెగాస్టార్ అనే బిరుదును చిరంజీవి పేరుకు ముందు జత చేసి దాన్ని శాశ్వతం చేసారు. అప్పటి దాకా సుప్రీమ్ హీరో డైనమిక్ హీరో మైటీ హీరో అంటూ రకరకాల ట్యాగులతో చిరు పేరును వాడుకున్న దర్శక నిర్మాతలు మరణమృదంగం తర్వాతే మెగాస్టార్ అని ఫిక్స్ అయిపోయారు.
ఈ సినిమా విడుదలై ఈ రోజుతో సరిగ్గా 30 ఏళ్ళు. అంటే చిరంజీవికి పేరు ముందు మెగాస్టార్ అని సిల్వర్ స్క్రీన్ మీద పడింది ఇవాళే. అందుకే సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో అభిమానులు ఈ సినిమా తాలూకు జ్ఞాపకాలు పోస్టర్లతో మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చింది అనే దాని గురించి వివరాలు షేర్ చేసుకుంటున్నారు. మరణమృదంగం ఆ టైంలో వచ్చిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ. ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా యండమూరి వీరేంద్రనాథ్ సూపర్ హిట్ నవల ఆధారంగా కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ మూవీ అప్పట్లో డీసెంట్ హిట్ గా నిలిచింది. నవలను విపరీతంగా చదివేసిన ప్రేక్షకులు అందులో ప్రతిదీ సినిమాలో ఉండాలని కోరుకువడంతో బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. కానీ పాటలు మాత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. ముఖ్యంగా కరిగిపోయాను కర్పూరవీణలా పాట ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ బెస్ట్ ఛాయస్. మెగాస్టార్ బిరుదును మొదటిసారి మీడియా ముందు ప్రకటించింది రావు గోపాల్ రావు గారు. ఆ టైంలో చిరు ప్రతి సినిమాలో కనిపించే ఈయన మరణమృదంగంలో మాత్రం లేరు.
దీంట్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు సురేష్ ఒబెరాయ్ కొడుకు వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ప్రతి నాయకుడిగా నటించడం కాకతాళీయం. అందుకే ఇంత స్పెషల్ మూమెంట్ ని మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కెఎస్ రామారావే నిర్మించిన తేజ్ ఐ లవ్ యు వేడుకలో చిరు కొన్ని జ్ఞాపకాలు నెమరువేసుకున్న సంగతి తెలిసిందే. సో మెగాస్టార్ అనే పేరు పుట్టి 30 ఏళ్ళైన సందర్భం అంటే ఫాన్స్ కి స్పెషల్ కాక ఏముంటుంది.