బాహుబలి ది బిగినింగ్ కు సీక్వెల్ గా బాహుబలి ది కంక్లూజన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలో 95 శాతం షాట్స్ కు గ్రాఫిక్స్ అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారంటే.. విజువల్ ఎఫెక్ట్స్ కు ఏ రేంజ్ లో ఇంపార్టెన్స్ ఉందో అర్ధమవుతుంది.
తాజాగా బాహుబలి గ్రాఫిక్ వర్క్ కి సంబంధించిన అప్ డేట్ చెప్పుకొచ్చాడు VFX ఇన్ ఛార్జ్ కమల్ కణ్ణన్. 'బాహుబలి ది కంక్లూజన్ కోసం 15 నెలలుగా గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. దేశంలోని అన్ని విజువల్ స్టూడియోలు ఒకే లైనప్ గా వర్క్ చేస్తున్నాయి. అందరి టార్గెట్ ఒకటే. సరైన సమయానికి పనులు పూర్తి చేయగలగడమే. ప్రపంచ వ్యాప్తంగా 33 స్టూడియోల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంతకంటే సంతృప్తి కరమైన లైఫ్ దొరకదేమో' అన్నాడు కమల్.
ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి రిలీజ్ కు బాహుబలి ది కంక్లూజన్ రెడీ అవుతోంది. మరోవైపు ఫిబ్రవరి మూడో వారంలో ఈ వార్ డ్రామాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ లాంఛ్ మాదిరిగానే ముంబైలో.. గ్రాండ్ గా ఈ టీజర్ లాంఛ్ జరగనుందని అంటున్నారు. అలాగే ఆడియో రిలీజ్ డేట్ ను టీజర్ విడుదల సందర్భంగా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయట!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/