35 కోట్లు .. USలో గ‌ర్జిస్తున్న RRR

Update: 2022-03-26 00:48 GMT
2022 మోస్ట్ అవైటెడ్ మూవీ RRR రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఆరంభం క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా కానీ ఈ సినిమా విజువ‌ల్ బ్రిలియ‌న్సీకి జ‌నం ప‌ట్టంగ‌డుతున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ్రేక్ అవుతున్నాయి.  తాజా స‌మాచారం మేర‌కు పీరియడ్ ఎపిక్ RRR ఇంటా బ‌య‌టా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము రేపుతోంది. అమెరికాలో ఈ చిత్రం ఇప్ప‌టికే 4.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింద‌ని పంపిణీ వ‌ర్గాలు స్ప‌ష్ఠం చేశాయి. అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ గ‌ర్జిస్తోంద‌ని ఇప్ప‌టికీ (డే 1లో 11.45 ఏఎం వ‌ద్ద‌) వ‌సూళ్ల కౌంట్ అద్భుతంగా కొన‌సాగుతోంద‌ని ప్ర‌క‌టించాయి. 4.5 మిలియ‌న్ డాల‌ర్లు అంటే సుమారు 34.5 కోట్లు.

రామ్ చరణ్ - జూనియ‌ర్ ఎన్టీఆర్ కలిసి తెరపై మొదటిసారిగా కనిపించ‌డం .. అది అభిమానుల్లో పోటీకి తెర తీసిన సంగ‌తి తెలిసిందే. దీని ప్ర‌భావం కూడా వ‌సూళ్ల‌పై స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. డే1 బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ సందడితో ప్రారంభమైంది. USలో  ఈ చిత్రం ఇప్పటికే దాని ప్రీమియర్ షోల నుండి $3 మిలియన్లు వసూలు చేసింద‌ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇంత‌కుముందే వెల్ల‌డించారు.కేవ‌లం ప్రీమియర్ షోల నుండి $3 మిలియన్ల క్లబ్‌ను అధిగమించిన మొదటి భారతీయ చిత్రం ఇదేన‌ని ప్ర‌క‌టించారు. ఇంత‌లోనే ఈ చిత్రం డే వ‌న్ లో 11.45 నిమిషాల‌కు ఏకంగా 4.5 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింద‌ని వెల్ల‌డించడం ఒక సంచ‌ల‌నం.

రాఫ్తార్ క్రియేషన్స్  ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాని విడుదల చేసింది. వారి ట్విట్టర్ పేజీ స‌మాచారం మేర‌కు.. "USA ప్రీమియర్స్ కామ్ స్కోర్.. అవర్లీ గ్రాస్ ప‌రిశీలిస్తే.. 981 లొకేషన్ ల నుండి $3000127 రాత్రి 7:45 PM PST నుండి ప్రీమియర్స్ (sic) ద్వారా వ‌సూలైంది. $3 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న అసాధాణ‌ భారతీయ చిత్రమిది`` అని వెల్ల‌డించింది.

దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించిన ఆర్.ఆర్.ఆర్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రికార్డు సంఖ్యలో స్క్రీన్ లలో  గ్రాండ్ గా విడుదలైంది.

RRR అనేది 1920కి పూర్వం జ‌రిగిన క‌థాంశం. పూర్వ స్వాతంత్య్ర‌ యుగంలో జరిగిన కల్పిత కథ .. ఇది ఇద్దరు నిజమైన హీరోలు .. సుప్రసిద్ధ విప్లవకారుల జీవితాల ఆధారంగా రూపొందించారు. అల్లూరి సీతారామ రాజు - కొమరం భీమ్ క‌ల‌యిక‌తో వ‌చ్చిన చిత్ర‌మిది. రామ్ చరణ్ సీతారామరాజుగా నటించగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భీమ్ గా నటించారు. RRR రాజమౌళి నుంచి మొదటి పూర్తి నిడివి పీరియాడికల్ చిత్రం. అతని చిత్రం మగధీరలో ఒక పీరియడ్ పోర్షన్ ఉన్నా.. దాదాపు సగం చిత్రం  మోడ్ర‌న్ డేస్ తో ఉంటుంది. జ‌క్క‌న్న తెర‌కెక్కించిన‌ చాలా చిత్రాల మాదిరిగానే RRR కూడా రివెంజ్ డ్రామానే. కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ వంగాతో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజమౌళి తన సినిమాలు ఎక్కువగా ప్రతీకారంపై ఆధారపడి ఉంటాయని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఎందుకంటే ఇది బలమైన భావోద్వేగం.. ఈ ఫార్ములాని ఆయ‌న విడిచిపెట్ట‌రు. అదే ఆయ‌న స‌క్సెస్ మంత్ర‌.

అజయ్ దేవగన్- అలియా భట్- సముద్రఖని- శ్రియా శరణ్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. నిజానికి RRR సినిమా థియేటర్లలో జనవరి 7న విడుదల కావాల్సి ఉండ‌గా దేశంలో ఓమిక్రాన్ సంబంధిత కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో విడుదల వాయిదా పడింది.
Tags:    

Similar News