స్టార్ హీరోలకు ధీటైన టార్గెట్.. పుష్పారాజ్ 60మిలియన్స్..!

Update: 2021-05-04 14:30 GMT
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన నటుడుగా రూపొందుతున్న భారీ సినిమా పుష్ప. ఈ నెలలోనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా పుష్ప చిత్రబృందం సినిమా నుండి పుష్పారాజ్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేసింది. అసలే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం అనేసరికి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటి అంచనాల నడుమ పుష్పారాజ్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్ చేసేసరికి ఆ వీడియో యూట్యూబ్ వేదికగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. గత మూడు వారాలుగా ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి పుష్పారాజ్ టీజర్.. కేవలం విడుదలైన 20 రోజుల్లో 50 మిలియన్స్ వ్యూస్ రాబట్టి టాలీవుడ్ లోనే ఫాస్ట్ 50మిలియన్స్ బ్రేక్ చేసి టాప్ లో నిలిచింది.

అయితే తాజాగా పుష్పారాజ్ 'తగ్గేదే..లే' అంటూ 60మిలియన్స్ వ్యూస్ అవలీలగా క్రాస్ చేసింది. 60మిలియన్స్ వ్యూస్ తో పాటు 1.4మిలియన్ పైగా లైక్స్ దక్కించుకొని ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం పుష్పారాజ్ టీజర్ అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న వీడియోగా పుష్పారాజ్ రికార్డు దక్కించుకుంది. ఇప్పటికి పుష్పారాజ్ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం. “ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పారాజ్” వీడియోతో సుకుమార్ బృందం అల్లు ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. అయితే యూట్యూబ్ ఇంట్రడక్షన్ టీజర్ లలో పుష్పారాజ్ స్టార్ హీరోలకు సరైన టార్గెట్ సెట్ చేసిందని టాక్.

ఈ వీడియో సోషల్ మీడియాలో తగ్గేదేలే అంటూ రికార్డులు నమోదు చేస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అడవిలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఆగష్టు 13న సినిమా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.
Tags:    

Similar News