ఓటీటీ రిలీజ్‌ నిజం కాదన్న బయోపిక్‌ మేకర్స్‌

Update: 2020-06-15 08:51 GMT
బాలీవుడ్‌ లో రూపొందిన కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ 83 మూవీని ఈ సమ్మర్‌ లో విడుదల చేయాలని భావించారు. ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా చేశారు. కాని మహమ్మారి వైరస్‌ కారణంగా సినిమా విడుదల ముందు వాయిదా వేయాల్సి వచ్చింది. మూడు నెలలుగా థియేటర్లు ఓపెన్‌ లేవు. మరో రెండు మూడు నెలల వరకు థియేటర్లు మూత బడే ఉంటాయేమో అంటున్నారు. ఆ కారణంగా 83 చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఈ సినిమాకు భారీ మొత్తంను ఆఫర్‌ చేసినట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. 83 మేకర్స్‌ కూడా ఓటీటీ విడుదలకు మొగ్గు చూపిస్తున్నట్లుగా వచ్చిన వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. సినిమాను ఓటీటీలో విడుదల చేసే ఉద్దేశ్యం లేదని.. థియేటర్లు ఓపెన్‌ అయితే ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నామని మేకర్స్‌ ప్రకటించారు.

1983 సంవత్సరంలో టీం ఇండియా ప్రపంచ కప్‌ గెలిచింది. ఆ టోర్నీ నేపథ్యంలో సినిమా సాగుతుంది. అదే సమయంలో కపిల్‌ దేవ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా కొన్ని సీన్స్‌ ఉంటాయి. కపిల్‌ దేవ్‌ పాత్రను రణ్‌ వీర్‌ సింగ్‌ పోషించాడు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను విష్ణు ఇందూరి నిర్మించాడు. తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌ డబ్‌ చేసి విడుదల చేసేందుకు రైట్స్‌ ను దక్కించుకుంది. పలు భాషల్లో ఈ సినిమాను ఒకేసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
Tags:    

Similar News