ఇండియన్ సూపర్ హీరోల లిస్ట్ లో హృతిక్ రోషన్.. షారూక్ ఖాన్ ల సరసన చేరిపోదామని అనుకుని.. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ బాగానే ట్రై చేశాడు. ఏ ఫ్లయింగ్ జాట్ అంటూ కృష్ణాష్టమి రోజున ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేద్దామని అనుకున్నాడు కానీ.. మూవీ రిజల్ట్ ఇప్పటికే తేలిపోయింది. సినిమాతో సూపర్ హీరోగా అవతరించలేకపోయినా.. పైరసీ మాత్రం ఓ సూపర్ ఫీట్ సాధించాడు ఫ్లయింగ్ జాట్.
గత కొంత కాలంగా పైరసీ దెబ్బ సినిమాకి ఇండస్ట్రీకి గట్టిగానే తలుగుోతంది. దీంతో ఫ్లయింగ్ జాట్ ను నిర్మించిన బాలాజీ మోషన్ పిక్చర్స్.. పైరసీని ప్రోత్సహిస్తున్న 830 వెబ్ సైట్ల వివరాలను కలెక్ట్ చేసి.. వాటిని మద్రాస్ హైకోర్టకు అందించింది. వీటితో పాటు 38 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల వివరాలు.. ఐదు కేబుల్ టీవీ ఆపరేటర్ల డీటైల్స్ కూడా ఉన్నాయి. పాటలు.. విజువల్స్.. కొన్నిసార్లు మొత్తం సినిమాలను డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ సైట్లు అవకాశం కల్పిస్తున్నాయంటూ కోర్టుకు విన్నవించింది ఫ్లయింగ్ జాట్ నిర్మాణ సంస్థ.
వీటిని పరిశీలించిన మద్రాస్ హైకోర్టు.. ఆ 830 సైట్లను బ్లాక్ చేయాలంటూ.. ఐఎస్పీలకు ఆదేశించింది. అంతే కాదు.. కేవలం 24 గంటల్లో ఈ సైట్లన్నీ నిలిచిపోయేలా చర్యలు కూడా తీసుకుంది.