క‌ల్ట్ క్లాసిక్ తో సాహ‌సం స‌రైన‌దేనా?

Update: 2020-01-30 11:38 GMT
క‌ల్ట్ జోన‌ర్ ని ట‌చ్ చేయ‌డం అంటే సాహ‌స‌మే. ఎన్నో గ‌ట్స్ ఉంటే కానీ ట‌చ్ చేయ‌రు. టాలీవుడ్ హిస్ట‌రీలో క‌ల్ట్ ని ట‌చ్ చేసి మెప్పించడంతో నాగార్జున గ‌ట్స్ కు పేరొచ్చింది. శివ సినిమాతో ఈ జోన‌ర్ కి పాపులారిటీ ద‌క్కింది. ఆ త‌ర్వాత ఆర్జీవీ కాంపౌండ్ ఇలాంటివి ఎన్నో చేసినా స‌క్సెస్ కాలేదు. అప్ప‌ట్లో వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా ఆర్జీవీ తెర‌కెక్కించిన క్లాసిక్ క‌ల్ట్ మూవీ క్ష‌ణ‌క్ష‌ణం సైతం బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. ఆ త‌ర్వాత బుల్లితెర‌పై మాత్రం జ‌నం చెవులు రిక్కించి చూశారు కానీ.. థియేట‌ర్ల‌కు వెళ్ల‌లేదు.

ఇక ఇటీవ‌ల వ‌చ్చిన సినిమాల్లో 96 సైతం ఈ త‌ర‌హానే. ఇదో క‌ల్ట్ క్లాసిక్ త‌ర‌హా. అందుకే ఈ సినిమాని దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు అన‌గానే అంద‌రూ నిరాశ‌ప‌రిచారు. ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇక త‌మిళ వెర్ష‌న్ చూసిన ఎవ‌రికీ రీమేక్ చేస్తే న‌చ్చుతుంది అని మాత్రం చెప్ప‌లేం. కానీ దిల్ రాజు ఆ సాహ‌సం చేశారు. విజ‌య్ సేతుప‌తి-త్రిష జంటగా ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జాను టైటిల్ తో తెర‌కెక్కించి రిలీజ్ చేస్తున్నారు. త‌మిళ వెర్ష‌న్ లో చేసిన‌ విజ‌య్ పాత్ర‌లో శ‌ర్వానంద్- త్రిష పాత్ర‌ లో స‌మంత న‌టించారు.

మ‌రి రీమేక్ పై ఆడియ‌న్స్ అంత ఎగ్జైట్ గా ఉన్నారా? జాను ప్ర‌చార చిత్రాలు యూత్ ని క‌దిలిస్తున్నాయా? నిర్మాత దిల్ రాజు ప్లాన్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర్క‌వుట్ అవుతుందా? అంటూ చ‌ర్చ మొదలైంది. ప‌బ్లిసిటీతో బ‌జ్ ఆశించినంతగా ఏదీ క‌నిపించ‌డం లేదు. సినిమా తొలి పోస్ట‌ర్ ..అటుపై టీజ‌ర్ వ‌చ్చినా ఎందుక‌నో అంత బ‌జ్ రాలేదు. అటుపై రిలీజైన ట్రైల‌ర్... పాట‌ల‌కు ప్రేక్ష‌కులు అంత‌గా క‌నెక్ట్ కాలేక‌పోతున్నార‌న్న‌ టాక్ వినిపిస్తోంది. కాద‌లే కాద‌లే ట్యూన్ త‌మిళ్ స‌హా తెలుగులో సంచ‌ల‌నం సృష్టించింది. కానీ జాను కోసం దాన్ని రీ క్రియేట్ చేసినా అస‌లు అంత బ‌జ్ రాలేదు. త‌మిళ్ లో రిలీజ్ కు ముందే ఆ ఒక్క పాట సినిమాపై బోలెడంత హైప్ తీసుకొచ్చింది. కానీ తెలుగులో రిలీజ్ అయినా ఎక్క‌డో క‌నెక్ష‌న్ మిస్ అయింద‌నే విమ‌ర్శ వినిపిస్తోంది.

దీంతో స‌మంత‌-శ‌ర్వానంద్ ప్ర‌చార బ‌రిలో దిగి పైకి లేపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయినా ఏదీ ఫ‌లించ‌డం లేదు. ప్రేక్ష‌కులు ఇంకా సంక్రాంతి మూడ్ నుంచి బ‌య‌ట‌కు రాలేద‌ని..జానుకు క‌నెక్ట్ అవ్వ‌క‌ పోవ‌డానికి అదీ ఓ కార‌ణమ‌ని చెబుతున్నారు. అటు శ‌ర్వా ఆశ‌ల‌న్నీ ఈ సినిమా పైనే. కొన్నాళ్లు గా స‌రైన స‌క్సెస్ లేక ఎదురు చూస్తున్నాడు. జానులో న‌టించ‌డానికి చాలా మంది యంగ్ హీరోలు ప్ర‌య‌త్నించినా...చివ‌రికి రాజు గారిని క‌న్వెన్స్ చేసి మ‌రీ ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. అయితే కంటెంట్ ప‌రంగా క‌ల్ట్ క్లాసిక్ అనేది ఎప్పుడూ పెద్ద సాహ‌స‌మే. మ‌రి ఈ ప్ర‌చారానికి ధీటైన స‌మాధానం ఇవ్వాలంటే జాను థియేట‌ర్లు హౌస్ ఫుల్స్ అవ్వాల్సిందే. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.
Tags:    

Similar News