ఏ భాషలో అయినా క్లాసిక్ మూవీస్ ను రీమేక్ చేయడం, సీక్వెల్స్ చేయడం అంటే సాహసంతో కూడిన పని. క్లాసిక్ మూవీస్ ను రీమేక్ చేయాలని ప్రయత్నిస్తే చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. కొన్ని మాత్రం విజయాన్ని దక్కించుకున్నాయి. క్లాసిక్ రీమేక్ లో ఫీల్ పోకుండా ఉండేలా ప్లాన్ చేయాలి. అలా చేస్తేనే ఒరిజినల్ మాదిరిగా రీమేక్ కూడా క్లాసిక్ గా నిలుస్తుంది. తమిళంలో గత ఏడాది తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన '96' మూవీ క్లాసిక్ గా నిలిచింది. ఆ సినిమాను ఇప్పుడు రీమేక్ చేసేందుకు దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నాడు.
తమిళ ఫీల్ వచ్చేందుకు ఒరిజినల్ వర్షన్ డైరెక్టర్ నే దిల్ రాజు ఎంపిక చేసుకున్నాడు. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా దర్శకుడు ప్రేమ్ కుమార్ తో మార్పులు చేర్పులు చేయిస్తున్నాడట. దిల్ రాజు ప్రొడక్షన్ టీంతో కలిసి ప్రస్తుతం ప్రేమ్ కుమార్ 96 రీమేక్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. రీమేక్ సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ పెద్దగా ఉండదు. కాని కొన్ని రోజులుగా స్క్రిప్ట్ వర్క్ అంటూ ఈ చిత్రం గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో '96'ను తెలుగు ప్రేక్షకుల కోసం మార్చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే మాత్రం ఫలితం తేడా కొట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
శర్వానంద్ మరియు సమంతలు ఈ చిత్రం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 96 మూవీ తమిళనాట సూపర్ డూపర్ సక్సెస్ ను దక్కించుకున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో దిల్ రాజు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయిస్తే పరిస్థితి ఏంటీ చూడాలి.