మహేష్ బాబు ఎక్కడ.. నితిన్ ఎక్కడ.. ఇద్దరి బాక్సాఫీస్ స్టామినాకు ఏమైనా పోలిక ఉందా? ఎంత నితిన్.. త్రివిక్రమ్ తో జట్టు కట్టినా.. మామూలుగా చూస్తే ఇద్దరూ కలిసి మహేష్ స్టామినాకు దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశం లేదు. కానీ అన్నిసార్లూ స్టామినాలు పని చేయవు. ఎంతో ఊహించుకున్న సినిమా చతికిలబడొచ్చు. పెద్దగా అంచనాల్లేని సినిమా ఇరగాడేయొచ్చు. బ్రహ్మోత్సవం-అఆ సినిమాల పరిస్థితి ఇలాగే అయింది. మామూలుగా ఉన్న అంచనాల ప్రకారం అయితే.. ‘బ్రహ్మోత్సవం’ వారం రోజుల్లో సాధించే వసూళ్లను ‘అఆ’ ఫుల్ రన్లో సాధించినా కూడా ఎక్కువే. కానీ వాస్తవంగా జరిగింది వేరు. బ్రహ్మోత్సవం వారం రోజుల్లో సాధించిన వసూళ్ల కంటే కూడా ‘అఆ’ ఫస్ట్ వీక్ వసూళ్లు ఎక్కువ.
‘అఆ’ కంటే రెండు వారాల ముందు భారీ అంచనాలతో విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ రూ.33 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఐతే ‘అఆ’ వారం రోజుల్లో దాని కంటే కోటి రూపాయలు అదనంగానే కలెక్ట్ చేసింది. తొలి వారం ‘అఆ’ వసూళ్లు రూ.34 కోట్లను దాటిపోయాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (రూ.33.5 కోట్లు).. రేసుగుర్రం (రూ.33.15 కోట్లు). గోపాల గోపాల (రూ.33.11 కోట్లు).. బాద్ షా (రూ.32.6 కోట్లు).. ఆగడు (రూ.31.2) లాంటి బడా సినిమాల తొలి వారం వసూళ్లను సైతం ‘అఆ’ దాటేయడం విశేషం. ఫుల్ రన్లో ఈ సినిమా కచ్చితంగా రూ.50 కోట్ల మార్కును దాటడం ఖాయం. రెండో వీకెండ్లో సైతం ‘అఆ’కు భారీగా వసూళ్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.