ఆకాష్ పూరికి లాంగ్ బ్రేక్ త‌ప్ప‌దా!

Update: 2022-11-05 08:30 GMT
పూరి జ‌గ‌న్నాధ్  వార‌సుడిగా తెరంగేట్రం చేసిన ఆకాష్ కి ఇంకా స‌రైన స‌క్సెస్ ప‌డలేదు. శ‌క్తివంచ‌న లేకుండా శ్ర‌మిస్తున్నా ఫ‌లించ‌డం లేదు. ఇటీవ‌లే `చోర్ బ‌జార్` తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా కూడా ఆకాష్ అంచ‌నాలు అందుకో లేక‌పోయింది. అంత‌కు ముందు రెండు సినిమాలు సోసోగానే రాణించాయి. కానీ ఆ సౌండింగ్ ఇప్పుడున్న పోటీలో స‌రిపోదు.

బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి రేసులో ఉంటే త‌ప్ప లెక్క‌లోకి రాని ప‌రిస్థితి. మ‌రి ఆకాష్ తాజా ప‌రిస్థితి మాత్రం పూర్తి ప్ర‌తికూలంగానే  క‌నిపిస్తుంది. `చోర్ బ‌జార్` వైఫల్యంతో మ‌రింత బ్యాడ్ ఫేజ్ లోకి జారుకున్నాడు. అటు పూరి ప‌రిస్థితి స‌రిగ్గా లేదు. ఇటీవ‌ల ఆయ‌న తెర‌కెక్కించిన `లైగ‌ర్` రిలీజ్ అయి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కుంటుందో? తెలిసిందే.

పూరి ఇప్పుడున్న  స్థితిలో త‌న‌యుడితో సొంతంగా సినిమా నిర్మించ‌లేడు. బ‌య్య‌ర్లుకి చేసిన  ప్రామిస్ ని ముందుగా నిల‌బెట్టుకోవాలి. ఆ త‌ర్వాత కొత్త సినిమా ఆలోచ‌న చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం  వాటి తాలుకా సెటిల్మెంట్ లో బిజీగా ఉన్నారు. మ‌రి ఆకాష్ ప‌రిస్థితి ఏంటి? అంటే లాంగ్ గ్యాప్  త‌ప్ప‌ద‌నే ఫిలిం స‌ర్కిల్స్ లో చర్చ‌కొస్తుంది.

ప్ర‌తిభావంతుడే అయినా ఇంకా మార్కెట్ ని బిల్డ్ చేసుకోలేదు. న‌టుడిగా ఇప్పుడిప్పుస‌డే ఎదుగుతున్నాడు. త‌నిన న‌మ్మి కోట్ల రూపాయలు పెట్టుబ‌డి పెట్ట‌డ‌ని ఆకాష్ నే స్వ‌యంగా త‌న స్టామినా గురించి ఓ సంద‌ర్భంలో రివీల్ చేసాడు. న‌టుడిగా ఎదిగే ప్రాస‌స్ లో నే ఉన్నాన‌ని...స‌రైన స‌క్సెస్ ప‌డిన త‌ర్వాత నాన్న‌తో నేనే సినిమా చేస్తాన‌ని గ‌ర్వంగా ప్ర‌క‌టించాడు.

అంత‌వ‌ర‌కూ ఆకాష్ వెయిట్ చేయాల్సిందే. బ‌య‌ట బ్యాన‌ర్ల‌లో అవ‌కాశాల కోసం  సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేయాలి. ఆడిష‌న్ లో సెల‌క్ట్ కావాలి. ఆ త‌ర్వాతే ఛాన్స్. ఇవ‌న్నీ ఆకాష్ కి కొత్తేం కాదు. తండ్రి బాట‌లోనే త‌న‌యుడి ప్ర‌యాణం సాగిస్తున్నాడు. క‌ష్టాన్ని న‌మ్ముకుని ముందుకెళ్తున్నాడు. నెపోటిజం  ని అడ్వాంటేజ్ గా తీసు కుని అవ‌కాశాలు అందుకోవ‌డం లేదు.

ఇండస్ర్టీలో సక్సెస్ ..నేమ్ అన్ని నాన్న కార‌ణంగా కాకుండా..స్వ‌యంగానే సంపాదించాల‌ని క‌మిట్ మెంట్ ఉన్న  కుర్రాడు.  ఆ ర‌క‌మైన క‌ష్టాన్ని మాత్ర‌మే న‌మ్ముకుని ముందుకు సాగుతున్నాడు. త‌న మాట‌ల ద్వారానే త‌న లో మెచ్యురిటీ బ‌య‌ట ప‌డుతుంది. మ‌రి ఇవ‌న్నీ దాటుకుని కొత్త ఛాన్స్ అందుకుంటాడా?  లేక  లాంగ్ బ్రేక్ తీసుకుంటాడా? అన్న‌ది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News