తనదైన విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గొప్ప పాపులారిటీ సంపాదించాడు ధనుష్. ఇటీవల హాలీవుడ్ లోను ప్రవేశించిన దక్షిణాది స్టార్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు ఇప్పుడు తెలుగులోను స్ట్రెయిట్ మూవీతో రంగ ప్రవేశం చేస్తున్నాడు. ధనుష్ ద్విభాషా చిత్రం `సార్` (వాతి-తమిళం) ఇటీవల ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ మూవీ ప్రచారంలో స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఇందులో ధనుష్ సరసన సంయుక్తా మీనన్ కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ - ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇటీవల విడుదలైన పోస్టర్ల లో ధనుష్ ఎప్పటిలానే పక్కింటి కుర్రాడిలా ఎంతో నేచురల్ గా ఆకట్టుకోగా సంయుక్త చీరకట్టులో సాంప్రదాయబద్ధంగా మురిపించింది. తొలి సింగిల్ తో ప్రచారంలో వేగం పెంచింది చిత్రబృందం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి. ధనుష్ నటిస్తున్న ఈ ద్విభాషా చిత్రంపై చక్కని అంచనాలేర్పడ్డాయి.
తాజాగా సార్ (వాతి) నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించారు. 17 ఫిబ్రవరి 2023న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు - తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. రిలీజ్ పోస్టర్ లో ధనుష్ నీలిరంగు ఫార్మల్ షర్ట్ ధరించి విద్యార్థుల సమూహంతో రౌండప్ చేయబడి కళాశాలలో మెట్ల మీద ఆడంబరంగా కూర్చున్నాడు. సార్ షూటింగ్ పూర్తయింది.
పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ -మొదటి సింగిల్ `మాస్టారు మాస్టారు..` అభిమానుల నుండి ఏకగ్రీవంగా సానుకూల స్పందనలను పొందాయి.
తనికెళ్ల భరణి- సముద్రఖని- తోటపల్లి మధు- నర్రా శ్రీనివాస్- పమ్మి సాయి- హైపర్ ఆది- షరా- ఆడుకలం నరేన్- ఇళవరసు- మొట్టా రాజేంద్రన్- హరీష్ పేరడి- ప్రవీణ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ జీవీ ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వస్తున్న ఈ చిత్రానికి జె యువరాజ్ సినిమాటోగ్రపీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ కాగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.