కాలం మారుతోంది. క్యాలెండర్లో సంవత్సరాలు కరిగిపోతున్నాయి. అంతకంతకూ అందుబాటులో వస్తున్న సాంకేతికత గురించి గొప్పలు చెప్పుకుంటూ.. ప్రపంచం డిజిటల్ యుగంలో నడుస్తుందని గొప్పలు చెప్పుకున్న వేళలోనూ కులం.. మతం.. ప్రాంతం.. లాంటి పైత్యాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి. ఇదెంత ఎక్కువైందన్న విషయం తాజాగా వెలుగు చూసిన ఒక ఉదంతాన్ని చూస్తే మరింత బాగా అర్థమవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొత్త వారితో మాట కలిపిన పది నిమిషాలకే మీదే కులం అని మొహమాటం లేకుండా అడిగే వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కాదు. మరికొందరు మాత్రం కాస్తంత పాలిష్ గా మాటలు కలుపుతూ.. ‘‘మీరేవోట్లు’’ అంటూ అడగటం కనిపిస్తుంది. అంత దాకా ఎందుకు ఎవరైనా తెలుగు ప్రాంతాలకు చెందినోడు ప్రముఖుడిగా పేరు ప్రఖ్యాతులు వస్తే.. వెంటనే అతగాడి కులం ఏమిటని గూగుల్ లో సెర్చ్ చేసే దరిద్రం మన దగ్గర కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. పేరు చివరన ఉండే తోకలతో అర్థమైతే సరే.. లేదంటే వివరాలు తెలుసుకునే వరకు నిద్రపోని బ్యాచ్ కూడా కనిపిస్తుంటుంది.
తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సినిమా రంగం ఇప్పటికి కొన్ని కులాల చేతిలో ఉందనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కొందరికి బాగా అవకాశాలు రావటానికి కారణం కులమేనన్న మాటను చెబుతుంటారు. ఇదంతా ఎలా ఉన్నా.. తాజాగా బ్రహ్మాజీ సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుంటూ.. ‘అన్నా నేను మన కమ్యూనిటీకి చెందిన వాడిని. సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఏ చిన్న ఛాన్సు ఉన్నా.. ఏదోపాత్రలో నటించే అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నా’ అంటూ కులాభిమానాన్ని ప్రదర్శించాడు.
దీనికి బ్రహ్మాజీ తనదైన శైలిలో రియాక్టు అయ్యారు. కులం గురించి అతగాడు పెట్టిన పైత్యపు పోస్టుకు స్పందిస్తూ.. నేను ఇండియన్ ను.. తెలుగోడిని.. అదే నా కమ్యూనిటీ అంటూ బదులిచ్చారు.అవకాశం కావాలంటే నేరుగా అడగాలే కానీ ఇలా కులం.. గిలం ఏంట్రా అంటూ విరుచుకుపడ్డారు. మరికొందరైతే సరైన సమాధానం చెప్పి.. నోరు మూయించారని పొగుడుతున్నారు. ఇదంతా ఓపక్క సాగుతుంటే.. మరికొందరు మాత్రం ఇంతకీ బ్రహ్మాజీది ఏ కులం అంటూ ఆరా తీయటం చూస్తే.. వీళ్లు బాగుడరే.. అన్న భావన కలుగక మానదు.