కొత్తదనం నిండిన కథల్ని..కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో నేచురల్ స్టార్ నాని ఎప్పుడు ముందుంటారు. కథ..ఆ కథని ఎగ్జిక్యూట్ చేయగల నమ్మకం ఉంటే నానితో ఛాన్స్ ఖాయం చేసుకోవచ్చు. నాని ద్వారా పరిచయం అయిన దర్శకులు కొంత మంది ఉన్నారు. ప్రస్తుతం వాళ్లంతా మేకర్స్ గా బిజీ అవుతున్నారు.
బేసిక్ గా నాని అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా రావడంతోనే? తనలో ఈ క్వాలిటీ బలంగా కనిపిస్తుంది. కథని జడ్డ్ చేయడం.. దాన్ని అతను అనుకున్నది అనుకుట్నట్లు తెరకెక్కించగలడా? అన్నది నాని ముందే పసిగట్టగల నేర్పరి. నాని సక్సెస్ కి కొత్త వాళ్ల ఎంపిక అన్నది ఓ సీక్రెట్ గా చెప్పొచ్చు. ఇండస్ర్టీలో నాని వారసుల పోటీని తట్టుకుని నిలబడ్డాడు? అంటే ప్రధానమైన కారణం తనలో ఈ లక్ష్మణమే.
అయితే కొత్త వాళ్లు నాని పరీక్షలో పాస్ అవ్వడం కూడా అంత వీజీ కాదు. అన్ని రకాల టెస్టులు పాసైన తర్వాతే ఛాన్స్. ప్రస్తుతం నాని కథానాయకుడిగా నటిస్తోన్న 'దసరా' సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త దర్శకుడ్ని పరిచయం చేసే బాధ్యత నాని మరోసారి తీసుకున్నాడు.
ఇటీవలే ఆ యువ మేకర్ చెప్పిన కథకి లాక్ అయినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా లండన్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. ఈ సినిమాని ఓ అగ్ర దర్శకుడే నిర్మిస్తున్నారు. ఒకప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామిగా ఉన్న సివి మోహన్ ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారుట. ఇది అతని కొత్త బ్యానర్ నుండి వస్తున్న మొదటి చిత్రం అని తెలుస్తోంది.
వచ్చే వారం ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఏడాది మొదట్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందిట. ఇటీవలే నటీనటులు.. టెక్నికల్ టీమ్ ఎంపిక సైతం పూర్తిచేసారుట. అలాగే నాని మరో రెండు ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుపుతున్నాడుట. అవి కూడా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి కొత్త ఏడాది లో నాని నుంచి వరుసగా కొత్త సినిమా ప్రకటనలు ఆధికారికంగా వచ్చే ఛాన్స్ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.