అ..ఆ.. ఆడియో ఏమైందబ్బా?

Update: 2016-04-26 11:30 GMT
అ..ఆ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. వచ్చే నెలలో విడుదలకు కూడా ప్లాన్ చేసేసుకున్నారనే టాక్ ఉంది. మే 13న కానీ, 20న కానీ అ..ఆ.. రిలీజ్ అంటూ చాలానే మాటలు వినిపించాయి. కానీ వాస్తవంలో మాత్రం.. అసలంత విషయం కనిపించడంలేదు. వచ్చే నెల 13న విడుదల చేయాలంటే కనీసం ఓ 3 వారాల ముందన్నా ఆడియో రిలీజ్ చేయాల్సి ఉంటుంది.

నిజానికి ఏప్రిల్ 26న అ..ఆ.. ఆడియో ఫంక్షన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడా తేదీ వచ్చేసినా యూనిట్ నుంచి ఎలాంటి సందడి లేదు. కనీసం ఆ మాట కూడా ఎవరకూ ఎత్తడం లేదు. ఆడియో విషయంలోనే యూనిట్ లో క్లారిటీ ఉండడం లేదు. దీనికి ఇండస్ట్రీ జనాలు చాలానే కారణాలు చెప్పుకుంటున్నారు. ఇందులో షూటింగ్ పార్ట్ ఇంకా కంప్లీట్ అవలేదన్నది ప్రధానమైనది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం అయితే కొంచెం నయం. దాని పైనా ఇలాంటి ఆలస్యం కబుర్లు చాలానే ఉన్నా.. కనీసం ఆడియో రిలీజ్ కి డేట్ అయినా ఇచ్చారు. మే 27న రిలీజ్ పైనా ఓ క్లారిటీ ఉంది.

కానీ త్రివిక్రమ్ తీస్తున్న చిత్రం మాత్రం కన్ఫ్యూజన్ కేరాఫ్ అడ్రస్ లా మారిపోయింది. ఎప్పుడో పొంగల్ కి రిలీజ్ అన్నదగ్గరి నుంచి మొదలుపెట్టి.. ఇప్పటివరకూ చాలానే వాయిదాలు పడ్డాయి. రీసెంట్ టైంలో ఇంతగా ఆలస్యం అయిన భారీ సినిమా అ..ఆ.. ఒక్కటే అని ఖచ్చితంగా చెప్పచ్చు.
Tags:    

Similar News