వైఫ్‌కి బిర్యానీ తినిపిస్తున్న కుర్ర హీరో

Update: 2015-07-06 13:30 GMT
హీరో ఆది ఇటీవలి కాలంలో విలువైన సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తున్నాడు. పెళ్లి తర్వాత ఎక్కువ సమయం భార్య కోసమే కేటాయించాడు. జీవిత భాగస్వామిని 100శాతం సంతోషంగా ఉంచడం కోసం వీలున్నంతవరకూ తపిస్తున్నాడు. అంతేనా వీలున్నప్పుడల్లా వైఫ్‌ అరుణతో కలిసి హైదరాబాదీ బిర్యానీ లొట్టలేసుకుని తింటున్నాడు. భార్యకు తినిపించిన బిర్యానీ జాయింట్ల గురించి ముచ్చటిస్తూ చాలా విషయాలు తెలిపాడు ఆది.. పదండి ఓ లుక్కేద్దాం..

''అరుణతో కలిసి రకరకాల వంటకాల్ని టేస్ట్‌ చేస్తున్నా. వారానికి నాలుగైదు సార్లు బిర్యానీ తినడం అలవాటైంది. ఆవకాయ్‌, ఉలవచారు వెర్షన్లతో పాటు కాబులి చానా బిర్యానీ అంటే అరుణకు చాలా ఇష్టం. అల్లం చికెన్‌ బిర్యానీ, ఈగిల్‌ స్పెషల్‌ బిర్యానీ ఇలా అన్నిటినీ టేస్ట్‌ చేశా'' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మటన్‌ వెర్షన్‌ మాత్రం తినలేదని కంగు తినిపించాడు. అంతేనా.. హైదరాబాదీ అయినా ఇంతవరకూ ఒక్కసారి కూడా హలీమ్‌ తినలేదని షాకిచ్చాడు. అయితే భవిష్యత్‌లో భార్యతో కలిసి హలీమ్‌ తినడానికి రెడీ అవుతున్నానని క్లూ ఇచ్చాడు. ఏదేమైనా భార్యకి చికెన్‌ బిర్యానీలో జాయింట్లు తినిపిస్తూ ఆది సంతోషంగా ఉన్నాడన్నమాట!

Tags:    

Similar News