ఐతే ప్రకాష్ రాజ్ లేదంటే ముఖేష్ రుషి.. అనుకునే కాలం పోయింది. జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు. విలన్లుగా కొత్త ముఖాల్ని చూడాలనుకుంటున్నారు. అందుకే దర్శకులు కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు. పొరుగు ఇండస్ట్రీల నుంచి ఫ్రెష్ టాలెంట్‌ను పట్టుకొస్తున్నారు. ‘రేసుగుర్రం’ సినిమాతో భోజ్ పురి హీరో రవికిషన్ ను సురేందర్ రెడ్డి విలన్ గా పరిచయం చేస్తే.. రాజమౌళి ‘ఈగ’లో సుదీప్ ను ప్రతినాయకుడిగా చూపించాడు. కొత్త దర్శకుడు రాధాకృష్ణకుమార్ తన ‘జిల్’ సినిమాతో కబీర్ అనే మోడల్ ను విలన్ గా పరిచయం చేసి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాలన్నింట్లోనూ విలన్ భలే హైలైట్ అయ్యాడు.
‘లెజెండ్’ సినిమాతో జగపతి బాబును విలన్ గా మార్చి ఇండస్ట్రీకి షాకిచ్చిన బోయపాటి శ్రీను కూడా అల్లు అర్జున్ తో చేయబోయే తన కొత్త సినిమాలోనూ విలన్ విషయంలో మరో ప్రయోగం చేయబోతున్నాడు. తమిళ హీరో ఆది పినిశెట్టిని విలన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. ఆది ‘ఒకవిచిత్రం’ అనే తెలుగు సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాడు. ఈ మద్య ‘గుండెల్లో గోదారి’లోనూ నటించాడు. కానీ అవి అతడికి సరైన ఫలితాన్నివ్వలేదు. తమిళంలో హీరోగా అతడికి మంచి పేరే ఉంది. అతణ్ని విలన్ గా పరిచయం చేయాలన్న బోయపాటికి ఎందుకొచ్చిందో కానీ.. అడగ్గానే ఓకే అనేశాడు ఆది. ‘లెజెండ్’తో జగపతి బాబు కెరీర్ మలుపు తిరిగినట్లే.. ఆది టాలీవుడ్ కెరీర్ కూడా టర్నింగ్ తీసుకుంటుందేమో చూడాలి.