హీరో ఆది తండ్రయిన ఎగ్జయిట్ మెంట్ లో ఉన్నాడు. తన ఇంటికి నేరుగా లక్ష్మిదేవి నడిచొచ్చిందన్నంత ఆనందంగా ఉన్నాడు. ఇటీవలే ఆడబిడ్డకు తండ్రయిన క్షణాన ఆది మోములో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆ క్షణం ఆ ఉద్వేగాన్ని పంచుకునేందుకు అతడికి మాటలు చాల్లేదు. నాలుక తడ బడింది. అవును ఈ ఆనంద క్షణాన్ని అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను తండ్రయ్యాను. నాకు కూతురు పుట్టింది అన్న విషయాన్ని దాచలేకపోతున్నా. .. అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఆది భార్య అరుణ తన స్వస్థలం రాజమండ్రిలోని ప్రయివేటు ఆస్పత్రిలో బిడ్డను కన్న సంగతి తెలిసిందే. ఆది తన కుటుంబంతోనే ఆనందాన్ని పంచుకుంటున్నాడు. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు. ప్రస్తుతం గరమ్ రిలీజ్ కి వస్తున్నా ప్రమోషన్ కి కూడా రావడం లేదు. ముందు కూతురు, తర్వాతే సినిమా అని ఫిక్సయిపోయాడు. కొద్దిరోజులు సెలవు తీసుకున్నాడు. ఆన్ సెట్స్ ఉన్న సినిమా గురించి టెన్షన్ పడడం లేదు.
అమ్మాయి కావాలని అనుకున్నా. నాకు అమ్మాయినే ఇచ్చాడు గాడ్. ఈ క్షణం ఎంతో సంతోషంగా ఉన్నా.. అని చెప్పిన ఆది. తన బిడ్డకు ఎ అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టుకుంటున్నానని అన్నాడు.
40 శాతం అమ్మ పోలిక, 60 శాతం నా పోలికే అంటూ మరో సీక్రెట్ ని కూడా చెప్పాడు ఆది. అన్నట్టు ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య - రాణీ ముఖర్జీ కూతురు పేరు ఆరా.. అదే తరహాలో ఆది కూతురు కూడా తన పేరులోని తొలి అక్షరాన్ని దొంగిలించబోతోంది అనమాట.