స్టార్ ఇమేజ్ తెచ్చేసుకుని.. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోక ముందు యంగ్ హీరోలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ లను ఇంట్రడ్యూస్ చేయడానికి.. కొత్త డైరెక్టర్లను పరిచయం చేయడానికి ధైర్యం చేయచ్చు. సహజంగా కుర్రాళ్లు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. కానీ సాయి కుమార్ కొడుకు ఆది మాత్రం.. అన్నీ మాస్ సినిమాలే చేస్తూ ఎదురు దెబ్బలు తినేస్తున్నాడు. మొదట్లో లవ్ లీ అంటూ ట్రై చేసినా.. ఆ తర్వాత మాస్ రూట్లోకి వచ్చేశాడు.
లవ్ లీ సినిమా కాస్త పర్లేదనే స్థాయిలోనే ఆడినా.. ఆ తర్వాత సుకుమారుడు- ప్యార్ మే పడిపోయానే- గాలిపటం- రఫ్- గరం.. సినిమాలు నిరుత్సాహపరిచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన చుట్టాలబ్బాయి పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. మూడ్రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. బాక్సాఫీస్ దగ్గర కంప్లీట్ గా డిజాస్టర్ అనిపించేసుకున్నాడు చుట్టాలబ్బాయి. ఆ లెక్కన వరుసగా ఆరు సినిమాలు ఫ్లాపైనట్టేగా. అంటే బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ కొట్టేశాడనమాట.
వెనక సాయి కుమార్ లాంటి సీనియర్ అండ ఉన్నా.. స్క్రిప్ట్ ల ఎంపికలో ఆది ఫెయిల్ అవుతున్నాడు. నాని.. నిఖిల్.. శర్వానంద్ లు భిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతుంటే.. ఈ కుర్రాడు మాత్రం ప్రతీ సినిమాకి డౌన్ అవుతున్నాడు. ప్రస్తుతం చేతిలో ఒక సినిమా కూడా లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇకనైనా స్టోరీల ఎంపికలో జాగ్రత్త వహించకపోతే.. ఆది కెరీర్ కి అంతం పలికేయాల్సి వస్తుందేమో!