సూరరై పొట్రు తెలుగులో `ఆకాశం నీ హద్దు రా` టైటిల్ తో అనువాదమైన సంగతి తెలిసిందే. సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ బయోపిక్ గా ప్రచారమైన ఈ చిత్రం మహమ్మారి కారణంగా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ చిత్రంలో నటించిన సూర్య - అపర్ణ బాలమురళి ఉత్తమ నటుడు - ఉత్తమ నటిగా జాతీయ అవార్డులను అందుకున్నారు. జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కూడా గెలుచుకుంది. ఇరు భాషల్లోను బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధించింది.
హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాధిక మదన్- పరేష్ రావల్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ హిందీ రీమేక్ కి సుధా కొంగర స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజా అప్ డేట్ ప్రకారం.. ఈ చిత్రం 1 సెప్టెంబర్ 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రిలీజ్ తేదీని ప్రకటించారు. ఇంకా హిందీ వెర్షన్ టైటిల్ నిర్ణయించాల్సి ఉంది.
ఈ రీమేక్‌ను సూర్య- జ్యోతికలతో కలిసి అరుణ భాటియా- విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు. సూర్య ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా అతిధి పాత్రలో నటిస్తున్నాడు. అక్షయ్ గత కొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. ఇప్పటికే మూడు వరుస ఫ్లాపులు అతడిని కలవరపెట్టాయి. మరోసారి తనని దక్షిణాది రీమేక్ ఆదుకుంటుందని ఆశిస్తున్నాడు. ఈ రీమేక్ మూవీ థియేటర్లలో ఏ స్థాయిలో మెప్పిస్తుందో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.