టాలీవుడ్ విషయంలో బాలీవుడ్ దిగొచ్చింది అనడానికి బాలీవుడ్ మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ మరో సాక్ష్యంగా నిలిచారు. నిన్నటి రోజున మెగాస్టార్ చిరంజీవి-అమీర్ మధ్య చోటు చేసుకున్న సంభాషణే ఇందుకు సజీవ సాక్ష్యం. ``ఇది వరకూ దక్షిణాది సినిమాలకు అంత గుర్తింపు ఉండేది కాదు. ఆ విషయం అమీర్ ఖాన్ తో చెప్పా. రాజమౌళి..శంకర్ సినిమాలు భాఇషల మధ్య హద్దుల్ని చెరిపేసాయి.
ఇప్పుడంతా భారతీయ సినిమాలే. ఇదెంతో ఆరోగ్యకరమైన వాతావరణం. ఆ విషయంలో నేనెంతో గర్వపడుతున్నానని`` మెగాస్టార్ చెప్పగా.. వెంటనే అమీర్ ఖాన్ స్పందిస్తూ.. హిందీ పరిశ్రమ నుంచి వచ్చి ఇప్పుడు మీ సహాయం కోరుతున్నా అని అన్నారు. దీంతో వెంటనే చిరంజీవిని అమీర్ ఎంతో ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ ఒక్క సన్నివేశం తో అమీర్ ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అన్నది స్పష్టమైంది.
చిరంజీవి నిన్నటి రోజున ఉన్న వాస్తవాన్ని చెప్పారు. ఆయన చెప్పింది నిజమే. ఒకప్పుడు నార్త్ ఇండస్ర్టీ....సౌత్ ఫిల్మ్ ఇండస్ర్టీల మధ్య చాలా వ్యత్యసమే ఉండేది. సౌత్ పరిశ్రమని చిన్న చూపుగా చూసేవారు. కానీ ఇప్పుడదే సౌత్ ఇండస్ర్టీ భారతీయ సినిమాకే తలమానికంగా నిలిచింది. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ ని రీచ్ అవుతుంది.
అందులోనూ తెలుగు..కన్నడ పరిశ్రమలు సౌత్ ఇండస్ర్టీని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి. `లాల్ సింగ్ చద్దా` తెలుగు రిలీజ్ కి చిరంజీవి సమర్పకుడిగా వ్యవహారించడం సినిమా స్థాయిని పెంచింది. అమీర్ మీ సహాకారం కావాలని అడగగా చిరంజీవి మరో మాట లేకుండా ఒకే చెప్పారు. అందుకు అమీర్ ఎంతో కృతజ్ఞతా భావం చూపించారు.
చిరంజీవి-అమీర్ మధ్య పానీ పూరి సన్నివేశం ఇద్దరి మధ్య బాండింగ్ ని మరింత స్ర్టాంగ్ చేసింది. ఇక రణబీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న `బ్రహ్మాస్ర్త` సినిమా ట్రైలర్ కి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. ఆరకంగా మరో హిందీ సినిమాలోనూ మెగాస్టార్ భాగమయ్యారు. చిరంజీవి ఎంట్రీతో ఆ రెండు సినిమాలకు కోట్ల రూపాయల పబ్లిసిటీ ఉచితంగా దక్కినట్లే.
ఈ సినిమా తెలుగు రిలీజ్ రాజమౌళి చేతుల మీదుగా జరుగుతోంది. ఈ రెండు సన్నివేశాలు చాలవా? టాలీవుడ్ సహాయం కోసం బాలీవుడ్ దిగొచ్చిందని చెప్పడానికి. సౌత్ ఇండస్ర్టీ అంటే గిట్టని కొన్ని ఘటాలు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది గమనించాల్సి విషయం.