ఆర్జీవి సిండికేట్.. వదిలిపెట్టిన చోటే మొదలు పెడుతున్నాడా..?

ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు తీసిన ఆర్జీవిని దాదాపు ప్రేక్షకులు అంతా మర్చిపోయారు.

Update: 2025-01-23 00:30 GMT

ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు తీసిన ఆర్జీవిని దాదాపు ప్రేక్షకులు అంతా మర్చిపోయారు. తనకు ఉన్న క్రేజీ డైరెక్టర్ ఇమేజ్ ని పూర్తిగా మర్చిపోయి వెరైటీ సినిమాలు, పబ్లిసిటీ స్టంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ తన సత్య నాటి రోజులు గుర్తు చేసుకుని మళ్లీ తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని గుర్తించాడు. లేటెస్ట్ గా ఎక్స్ లో తన సత్య విషయాలను చెబుతూ కొత్త సినిమా టైటిల్ ఇంకా కాన్సెప్ట్ గురించి రాసుకొచ్చాడు ఆర్జీవి.

ఈసారి ఆర్జీవి సిండికేట్ టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఆర్జీవి చెప్పుకొచ్చాడు. ఐతే సడెన్ గా ఆర్జీవి ఇలా టర్న్ తీసుకోవడం పట్ల అందరు ఇది కూడా ఒక పబ్లిసిటీనే అని అనుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్, టాలీవుడ్ స్టార్ ఇద్దరితో కలిసి ఆర్జీవి ఒక మల్టీస్టారర్ చేస్తాడని లేటెస్ట్ గా వార్తలు వస్తున్నాయి.

వాటికి బలం చేకూరేలా ఆర్జీవి తన సోషల్ మీడియా ఖాతాలో సిండికేట్ గురించి చెబుతూ రాసుకొచ్చాడు. ఐతే ఆర్జీవి సిండికేట్ అప్డేట్ తెలియగానే ఆయన ఫ్యాన్స్ హమ్మయ్య అనేస్తున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ శివ, సత్య టైం ఆర్జీవి మేల్కొన్నాడని. ఆర్జీవి మార్క్ సినిమా ఈ టైం లో తీస్తే నేషనల్ వైడ్ గా అన్ని రికార్డులు కొల్లగొడతాయని అంటున్నారు.

ఆర్జీవి స్కూల్ నుంచి వచ్చిన వారే కొన్నాళ్లు తమ టాలెంట్ చూపించి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మరి ఆర్జీవి రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా ఆర్జీవిలో ఈ మార్పు సినీ లవర్స్ కి మాత్రం జోష్ ఇస్తుంది. ఈ సిండికేట్ అప్డేట్ ఏంటి అందులో ఎవరెవరు నటిస్తారు అన్నది తెలుసుకోవాలని ఉత్సాహ పడుతున్నారు.

ఒకప్పటి ఆర్జీవి సినిమాటిక్ మ్యాజిక్ ఇప్పుడు రిపీట్ చేస్తే మాత్రం తెలుగు తెర మీద ఇంకా అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఆర్జీవి సిండికేట్ బాలీవుడ్ స్టార్స్ ని తీసుకుంటాడన్న టాక్ నడుస్తుంది. మొన్నటిదాకా ఆర్జీవి సినిమాలు తప్ప మిగతా అనవసరమైన విషయాల్లో తన జోక్యంతో విసుగు తెప్పించాడు. మరి ఇప్పుడు ఆర్జీవి సిండికేట్ తో సరికొత్త సంచలనానికి సిద్ధమయ్యాడు. ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News