కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఇళ్లలో బంధీ అయిందని చెప్పవచ్చు. దీంతో ఇళ్లలోనే ఖాళీగా ఉన్న జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం ఇంటర్నెట్.. టీవీలను ఆశ్రయిస్తున్నారు. చూసిన సినిమాలనే రిపీటెడ్ గా చూస్తున్నారు. టీవీలలో వచ్చిన సినిమాలే మళ్ళీ మళ్ళీ రీ టెలికాస్ట్ చేస్తుండటంతో బోర్ కొట్టిన జనాలు ఓటీటీలలో కొత్త కొత్త వెబ్ సిరీస్ లను - ఒరిజినల్ మూవీస్ ని చూస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా మాధ్యమాల కాలక్షేపం చేస్తున్నారు. అయితే ప్రపంచానికి పెద్దన్నని అని చెప్పుకునే అమెరికాని కూడా కరోనా వైరస్ అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇళ్లకే పరిమితమైన అమెరికావాసులు టీవీలకు అతుక్కుపోయారు. ఈ క్రమంలో ఈ వారంలో అక్కడి వారు అత్యధికంగా చూసిన సినిమా మన ఇండియన్ సినిమా. ఆ సినిమా ఏంటో తెలుసా..అదే మన '3 ఇడియట్స్'. ఆమిర్ ఖాన్ - మాధవన్ - షర్మన్ జోషీ - కరీనా కపూర్ - బొమన్ ఇరానీ - ఓమీ వైద్య తదితరులు ప్రధాన పాత్రల్లో రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ.. ”దశాబ్దం క్రితం మేము ఎంతో ఇష్టపడి చేసిన 3 ఇడియట్స్ ఇప్పటికీ అందరి మన్ననలు పొందుతుండం సంతోషంగా ఉంది” అని అన్నారు.
2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ '3 ఇడియట్స్' చిత్రం ఘన విజయం సాధించింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద రూ.460కోట్లు కలెక్ట్ చేసి అప్పట్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ మూవీ వచ్చి 11 సంవత్సరాలు కాగా ఇప్పటికీ అమెరికాలో క్రేజ్ తగ్గకపోవడం విశేషం. మరోవైపు ప్రపంచంలో అత్యధిక మంది చూసిన సినిమా లిస్ట్‌లో భారత్ నుంచి ఇప్పటికీ '3 ఇడియట్స్' మాత్రమే ఉండటం గమనించ దగ్గ విషయం. ఈ సినిమాని సౌత్ ఇండియాలో దర్శకుడు శంకర్ రీమేక్ చేసాడు. విజయ్ - జీవా - శ్రీరామ్ - ఇలియానా - సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా 'నంబన్' పేరుతో తమిళ్ లో రిలీజయింది. కానీ ఈ సినిమా ఇక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని చెప్పవచ్చు. ఇదే సినిమా మన తెలుగులో 'స్నేహితులు' పేరుతో విడుదలయింది. ఇక్కడ కూడా ఈ సినిమా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది.