అమీర్ ఖాన్ తన నటనతో జనాల్ని చాలాసార్లు ఏడిపించాడు. తారే జమీన్ పర్ సినిమాతో దర్శకుడిగానూ జనాల్ని ఏడిపించాడు. అలాంటి వాడిని ఓ సినిమా ఏడిపించేసింది. అమీర్‌పై బలమైన ముద్ర వేసిన ఆ సినిమా పేరు.. మార్గరిటా విత్ ఎ స్ట్రా. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కల్కి కొచ్లిన్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా ఇది. సోనాలీ బోస్ అనే లేడీ డైరెక్టర్ తీసిన సినిమా ఇది. సెరిబ్రల్ పాల్సీ (మస్తిష్క పక్షవాతం) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన సోదరి మాలిని జీవితం ఆధారంగా సోనాలి ఈ సినిమాను రూపొందించింది.
అరుదైన వ్యాధితో బాధపడుతూ కూడా ఎవరి మీదా ఆధారపడకుండా ఓ అమ్మాయి తన జీవితాన్ని కొనసాగించడానికి ఎలాంటి ఇబ్బందులు పడిందన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ నెల 17న ఇండియాలో రిలీజ్ కాబోతోంది. తన భార్య కిరణ్ రావు బలవంతం మేరకు ఈ సినిమా ప్రివ్యూకు వెళ్లాడట అమీర్. సినిమా చూస్తున్నంత సేపు అమీర్ ఏడుస్తూనే ఉన్నాడని.. సినిమా పూర్తయ్యాక తనను, డైరెక్టర్ సోనాలిని ప్రశంసల్లో ముంచెత్తాడని కల్కి చెప్పింది. ఈ షోకి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తోపాటు ఆయన భార్య జయాబచ్చన్ కూడా వచ్చారు. వాళ్లు కూడా సినిమా అద్భుతం అని ప్రశంసించారట. చూద్దాం.. అంత గొప్పదనం ఏముందో ఈ సినిమాలో.