పాత రికార్డులు ఊదేశాడు..

Update: 2017-01-05 11:19 GMT
నేను రంగంలోకి దిగనంత వరకే.. వన్స్ వచ్చానా రికార్డులే కొత్త రికార్డులు వెదుక్కోవాలి అన్నట్టుంటాడు బాలీవుడ్ హీరోఆమిర్ ఖాన్. మూవీ సెలక్షన్స్.. అవి చేసే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఆమిర్ సినిమాలు చెప్పకనే చెబుతాయ్. అందుకేనేమో రికార్డ్స్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించనని ఆమిర్ అన్నప్పటికీ థియేటర్లో ఉన్న ఆమిర్ సినిమాలు మాత్రం తమ పని తాము చేసుకుపోతాయ్.

మొన్న త్రీ ఇడియట్స్.. తర్వాత పీకే.. ఇప్పుడు దంగల్ ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఆమిర్ స్టామినాని పెంచుతూనే ఉన్నాయ్. ఇక విడుదలకు ముందు నుంచే మార్మోగిపోయిన స్పోర్ట్ డ్రామా దంగల్ రిలీజ్ తర్వాత దూసుకుపోతుంది. 2 వారాల్లోపే 300 కోట్లు కలెక్ట్ చేసి నయా ట్రెండ్ సెట్ చేసింది. దంగల్ కి ముందు ఆమిర్ పీకే.. సల్మాన్ భజరంగీ భాయ్ జాన్.. సుల్తాన్ సినిమాలు మాత్రమే 300 కోట్ల క్లబ్ లో ఉన్నాయ్. అవి కూడా ఫుల్ రన్లో వచ్చిన కలెక్షన్స్.

కానీ దంగల్ మాత్రం జస్ట్ టూ వీక్స్ లో వీటిని క్రాస్ చేసేసింది. అంటే ఇక మీదట వచ్చే ప్రతీ రూపాయ్ కొత్త రికార్డు కింద లెక్కే. అసలు ఇండియాలో బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల కలెక్షన్స్ అనే ట్రెండ్ స్టార్టైంది ఆమిర్ ఖాన్ తోనే. గజినీతో రికార్డుల వేట మొదలుపెట్టిన ఆమిర్ సినిమా సినిమాకి తన ట్రాక్ రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సల్మాన్ పోటీ పడుతున్నప్పటికీ సెకండ్ ప్లేస్ దగ్గరే ఆగిపోతున్నాడు. మధ్యలో ఓకే జానూ లాంటి ఒకటీ ఆరా క్రేజీ సినిమాలున్నా రిపబ్లిక్ డే వరకు బాలీవుడ్లో పెద్ద రిలీజ్ లు ఏవీ లేవు కాబట్టి ఇప్పట్లో దంగల్ జోరుని ఆపడం కూడా కష్టమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News