అమీర్ ఖాన్ - అమితాబచ్చన్ లు కలిసి నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ లోని అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు సైతం భావించారు. కాని అనూహ్యంగా ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ తీవ్రంగా నిరాశ పర్చింది. అమీర్ ఖాన్, అమితాచ్చన్ లకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో మొదటి రోజు ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు నుండి దారుణమైన కలెక్షన్ నమోదు అయ్యాయి.
‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రం ఫ్లాప్ అనే విషయం ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు, ఒప్పుకోవాల్సిందే. అదే విషయాన్ని తాజాగా షారుఖ్ ఖాన్ మీడియా ముందు చెప్పిన నేపథ్యంలో అమీర్ ఖాన్ అభిమానులు ఆయపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న షారుఖ్ ఖాన్ ను థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం గురించి స్పందించాల్సిందిగా మీడియా వారు కోరడం జరిగింది. అందుకు షారుఖ్ స్పందిస్తూ... అమీర్ మరియు అబితాబ్ జీ లు ఆ చిత్రం కోసం ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. ఒక మంచి సినిమాగా థగ్స్ నిలుస్తుందని భావించాను.
థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఫ్లాప్ అవ్వడం నాకు కూడా నిరాశగా ఉంది అన్నాడు. అంతగా కష్టపడిన మూవీ ఫ్లాప్ అవ్వడం పట్ల షారుఖ్ సానుభూతి కూడా వ్యక్తం చేశాడు. సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన వారి కష్టంను తేలికగా తీసిపారేయలేం అంటూ షారుఖ్ కామెంట్స్ చేశాడు. ఒక వైపు సినిమా థియేటర్ లో ఉండగా నువ్వు సినిమాను ఫ్లాప్ అంటూ ఎలా అంటావు అంటూ అమీర్ ఖాన్ అభిమానులు కొందరు షారుఖ్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. షారుఖ్ వ్యాఖ్యలపై అమీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.