కాంగ్రెసోళ్లకు ఆ డైరెక్టర్ ఇచ్చాడు చూడండీ..

Update: 2016-06-08 07:01 GMT
దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. దారుణాలు చోటు చేసుకుంటాయి. అన్నింటినీ అందరూ పట్టించుకోరు. కానీ ఎక్కడైతే వివాదం చెలరేగుతుందో.. ఆ కాంట్రవర్శీ నుంచి తమకేదైనా లాభం ఉంటుందని భావిస్తారో అక్కడికొచ్చి అందరూ వాలిపోతారు. ఆ మధ్య సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు ఎంతగా తపించిపోయాయో చూశాం. తెలుగు రాష్ట్రాల్లో వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కన్నెత్తి చూడని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఈ ఘటన తర్వాత మాత్రం ఒకటికి రెండుసార్లు హైదరాబాద్‌ లో వాలిపోయాడు. దీని వెనుక ఉద్దేశాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆ సంగతలా వదిలేస్తే లేటెస్టుగా నేషనల్ లెవల్లో కాంగ్రెస్ పార్టీకి క్యాష్ చేసుకోవడానికి ఓ ఇష్యూ దొరికింది. అదే.. ఉడ్తా పంజాబ్ సినిమా సెన్సార్ వ్యవహారం. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా తీసిన రియలిస్టిక్ మూవీ ఇది. ఐతే ఇందులో పంజాబ్ ను చెడుగా చిత్రీకరించారని.. బూతులు ఎక్కువున్నాయని.. డ్రగ్స్ వినియోగం అతిగా చూపించారని.. ఇంకా ఏవేవో కారణాలు చెప్పి సెన్సార్ వాళ్లు ‘ఉడ్తా పంజాబ్’ టీంను ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద పెద్ద వివాదమే నడుస్తోంది. సోషల్ మీడియాలో సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. ఐతే ఈ ఇష్యూలో ‘ఉడ్తా పంజాబ్’ టీంకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ ఇతర రాజకీయ పార్టీలు గళం విప్పాయి. మోడీని ఇరుకున పెట్టడానికి దీన్ని అవకాశంగా ఉపయోగించుకుంటూ ఇష్యూను మరింత పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఐతే మోడీ సర్కారును ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్-ఇతర పార్టీలు తన సినిమాను పావుగా వాడుకుంటున్నాయని గ్రహించిన ప్రముఖ దర్శకుడు.. ‘ఉడ్తా పంజాబ్’ నిర్మాత అనురాగ్ కశ్యప్ ట్విట్టర్లో తనదైన శైలిలో కాంగ్రెసోళ్లకు పంచ్ లు ఇచ్చాడు. ఈ వివాదంలో తనకు ఎవరి మద్దతూ అవసరం లేదని.. సోషల్ మీడియాలో ఓ పార్టీ పెయిడ్ ట్వీట్లతో ఈ కాంట్రవర్శీని మరింత పెద్దది చేయాలని ప్రయత్నిస్తోందని.. తనను యాంటీ ఎన్డీఏ ఏజెంట్ గానూ చిత్రీకరించే ప్రయత్నమూ జరుగుతోందని అతనన్నాడు. అంతేకాక తాను ఎన్డీయే ప్రభుత్వంలో కంటే యూపీఏలో సెన్సార్ సమస్యలు మరింత ఎక్కువగా ఎదుర్కొన్నానంటూ కాంగ్రెస్ వాళ్ల గాలి తీసేశాడు కశ్యప్. కాకపోతే ఇప్పుడు సెన్సార్ బోర్డును ఓ నియంత నడిపిస్తున్నాడని ప్రహ్లాద్ నిహలానిని ఉద్దేశించి సెటైర్లు వేశాడు అనురాగ్. ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూస్తానని.. తానే ఒంటరిగా పోరాడతానని కశ్యప్ స్పష్టం చేశాడు. కశ్యప్ వ్యాఖ్యలతో కాంగ్రెసోళ్లకు మామూలుగా పడలేదు పంచ్.
Tags:    

Similar News