లోకనాయకుడు కమల్ హాసన్. రీజనల్ ఇండస్ట్రీలో ప్రయాణం మొదలుపెట్టి విశ్వనటుడిగా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకొన్నాడు. అలాంటి కథానాయకుడితో పనిచేయాలని ఎవరికిమాత్రం ఉండదు. అందుకే జీవితంలో ఒక్కసారైనా కమల్ తో... అంటూ ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులూ కలలుగంటూ ఉంటారు. కమల్ ట్రెండీగా ఆలోచిస్తుంటాడు కాబట్టి నవతరానికి - కొత్త టాలెంట్ కి ఆయన సినిమాల్లో చోటు లభిస్తుంటుంది. కమల్ తో పనిచేసే అవకాశమంటేనే ఓ మెమరబుల్ థింగ్. దాన్ని మరింత మెమరబుల్ గా చేసుకొనే ప్రయత్నం చేశారు మన టాలీవుడ్ టెక్నీషియన్స్. వాళ్లెవరో కాదు... గీత రచయిత రామజోగయ్యశాస్త్రి, మాటల రచయిత అబ్బూరి రవి.
రామజోగయ్య శాస్త్రి మంచి గీతరచయితగా పేరు తెచ్చుకొన్నాడు. ఎంతోమంది అగ్ర దర్శకులు ఇటీవల ఆయనతో పాటలు రాయించుకొన్నారు. ఆయన పాటలు ట్రెండ్ కి తగ్గట్టుగా, భావుకత ఉట్టిపడేలా ఉంటాయి. ఆయనకి పాటలు రాయడం వృత్తి అయితే, నటించడం ప్రవృత్తి. వీలు దొరికినప్పుడల్లా ఆయన తెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తుంటాడు. ఇక అబ్బూరి రవి మాత్రం మాటలకే పరిమితమవుతుంటాడు. ఆయన ఇప్పటిదాకా తెరపై కనిపించింది లేదు. కానీ కమల్ కథానాయకుడిగా నటించిన `చీకటిరాజ్యం`లో రామజోగయ్యశాస్త్రితో పాటు, అబ్బూరి రవి కూడా నటించి తమ ముచ్చటని తీర్చుకొన్నారు. కమల్ సినిమా ఓ మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోవాలనే ఇద్దరూ ఆ ప్రయత్నం చేశారట. కమల్ కూడా వారి కోరికని మన్నించి తెరపై చిన్న పాత్రలు కట్టబెట్టారట. ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించారు రామజోగయ్యశాస్త్రి. అన్నట్టు కమల్ కి ఎవరైనా ఒక్కసారి నచ్చారంటే వాళ్లతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలని చూస్తుంటారు. సో ఈ ఇద్దరు రచయితలు భవిష్యత్తులో కమల్ చేసే తెలుగు సినిమాలకి కచ్చితంగా పనిచేస్తారని చెప్పొచ్చు.