మూవీ మోఘల్ రామానాయుడు గారాల మనవడు అభిరామ్ దగ్గుబాటి. నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడిగా పేరొంది అభిరామ్ త్వరలో 'అహింస' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి గారాల మనవడ్ని ఆ తాత నటుడిగా చూడాలనుకున్నారా? నిర్మాతగా తనలా రాణించాలనుకున్నారా? అంటే తాతయ్య కల కోసమే అభిరామ్ నటుడిగా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి అభిరామ్ని నిర్మాణం రంగంలోకి దించాలని సురేష్ బాబు అనుకునేవారుట. పెద్ద కుమారుడు రానా ఎలాగా నటుడిగా కొనసాగుతున్నాడు. బాబాయ్ వెంకటేష్ నటుడిగా రాణిస్తున్నారు. మళ్లీ మరో హీరో ఎందుకని భావించి సురేష్ బాబు తనయుడ్ని నిర్మాతగానే లాంచ్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. తన తర్వాత నిర్మాతగా వారసుడిగా ఆ బాధ్యతలు చిన్నకుమారుడికి అప్పగించి రిలాక్స్ అవ్వాలన్నది ఆయనప్లాన్ గా కనిపించింది.
కానీ తాతయ్య సలహా సహా పెద్దాయన కోరిక మేరకు అభిరామ్ నటుడిగానే తెరంగేట్రం చేయడానకి ఆసక్తి చూపించినట్లు ఓ ఇంటర్వ్యూలో సురేష్ బాబు తెలిపారు. అభిరామ్ నటుడు అవుతాడని ఆయన ఏ రోజు అనుకోలేదుట. ఆయన కూడా కుమారుడుని నటన వైపు వెళ్లమని చెప్పలేదంట. తాత నటన వైపు వెళ్లు అని చెప్పడంతో ఆయన మాటకు..తన అభిరుచికి తగ్గ నిర్ణయాన్ని తీసుకుని ముందుకెళ్లినట్లు తెలుస్తోంది.
'అహింస' చిత్రాన్ని మంచి రిలీజ్ తేదీ చూసుకుని రిలీజ్ చేస్తారని తెలిపారు. మొత్తానికి అభిరామ్ నటుడు అవ్వడం వెనుక తాత కీలక పాత్రధారే అని తెలుస్తోంది. హీరో అయితే ఆ ఫాలోయింగ్ వేరే లెవల్లో ఉంటుంది. నిర్మాతని మించిన సౌకర్యాలు హీరో జీవితంలో కలుగుతాయి. ప్రేక్షకులు ఆదరణ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇవన్నీ తాత రామానాయుడుకి బాగా తెలుసు.
నిర్మాతగా తన ప్రయాణం ఎలా సాగిందో ప్రేక్షకులకు తెలిసిందే. దేశంలో అన్ని భాషల్లో సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాతగా ఖ్యాతికెక్కారు. ఆరకంగా నిర్మాణ రంగంలో రామానాయుడు ఓ హీరోగా ఎదిగారు. ఓ స్టార్ హీరో స్థాయి క్రేజ్ నే నిర్మాణం రంగంలో సాధించారు. ఇది రామానాయుడికి మాత్రమే చెల్లింది. భారతదేశం గర్వించ దగ్గ గొప్పనిర్మాతగా కీర్తింపబడ్డారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.