టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల్లో ఒకరైన రామానాయుడు మనవడు.. ప్రస్తుత స్టార్ నిర్మాత సురేష్ బాబు తనయుడు.. స్టార్ హీరో రానా తమ్ముడు అయిన అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. బలమైన కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అభిరామ్ ఒక భారీ సినిమాతో ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ ఒక మీడియం రేంజ్ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్నాడు.
దర్శకుడు తేజ ఎంతో మంది నటీ నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. వారిలో పలువురు స్టార్స్ అయ్యారు. అందుకే ఆయన దర్శకత్వంలో అభిరామ్ ను పరిచయం చేయాలని భావించినట్లుగా తెలుస్తోంది. అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'అహింస' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా చాలా రోజుల క్రితమే వెళ్లడించారు.
అహింస అనే ఒక సినిమా అభిరామ్ హీరోగా రూపొందుతుంది అనే విషయాన్ని చాలా మంది మర్చి పోయారు. ఆ సినిమా గురించి కొన్ని నెలలుగా ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దర్శకుడు తేజ చాలా సైలెంట్ గా సినిమా షూటింగ్ ముగించాడట.
సురేష్ బాబు మరియు కొందరు ఇప్పటికే అహింస యొక్క రషెస్ చూసి సంతృప్తిగా ఉన్నారట. సినిమా ఒక మంచి సినిమా గా నిలుస్తుందని వారు నమ్ముతున్నారట. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తారీకున విడుదల చేయాలని నిర్ణయించారట.
ఇప్పటి వరకు షూటింగ్ అప్డేట్ లేకుండా సైలెంట్ గా ముగించిన యూనిట్ సభ్యులు ఇప్పుడు రిలీజ్ డేట్ ని కూడా నిర్ణయించి సైలెంట్ గానే ఉంటున్నారు. అంతా సైలెంట్ గా కంటిన్యూ అవుతున్న అహింస విడుదల తర్వాత అయినా సౌండ్ చేసి ప్రేక్షకులను ఆకర్షిస్తుందేమో చూడాలి.
ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతున్నాయి. ఈ నెలలోనే సినిమా అంటున్నారు కనుక అతి త్వరలోనే అన్ని విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.